టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అన్ని మతాలకు ఆదరణ

ABN , First Publish Date - 2020-12-20T05:23:55+05:30 IST

సర్వ మతాల ఆదరణ కోసం సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అన్ని మతాలకు ఆదరణ
ధర్మపురిలో క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌

 ధర్మపురి, డిసెంబరు 19: సర్వ మతాల ఆదరణ కోసం సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ధర్మపురి మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం ఆవరణలో నియోజకవర్గ స్థాయిలో 2,550 మంది క్రైస్తవులకు జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవితో కలిసి శనివారం దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ రాష్ట్రంలో పేద ప్రజల  అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. కుల మతాలను గౌరవిస్తున్న టీఆర్‌ఎస్‌ సెక్యులర్‌ ప్రభుత్వంగా పేరొందినట్లు  పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల మంది క్రైస్తవులకు దుస్తులు అందిస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్‌లో రూ. 10 కోట్లతో క్రైస్తవ భవ నం నిర్మిస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు అదనంగా 5 వేల మందికి దుస్తులు కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో గల 130 చర్చిలకు క్రిస్మస్‌ కేకులను పంపిణీ చేస్తున్నట్లు ఆయన వివ రించారు. చర్చీల మరమ్మతు, బోర్‌వెల్స్‌, విద్యుత్‌ సౌకర్యాలు ఏర్పాటు చేసి  సౌక ర్యాలు కల్పించినట్లు తెలిపారు. క్రైస్తవులు ఆనందోత్సహాల మధ్య పండుగ జరుపుకోవాలని కోరారు.  మంత్రి నేరెళ్ల గ్రామానికి చెందిన పుల్లాయిల భారతి, ఎలిగేటి విజయలకు రూ.5 లక్షలు చొప్పులన రైతు బీమా చెక్కు అందించారు.  మాజీ కోఆప్షన్‌ మెంబర్‌ మహ్మద్‌ సర్వర్‌ కుటుంబ సభ్యు లను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్‌ బోనగిరి నరేష్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్యమ్మ, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, జడ్పీటీసీ బత్తిని అరుణ, బుగ్గారం జడ్పీటీసీ బాదినేని రాజేం దర్‌, ఏఎంసీ చైర్మన్‌ అయ్యోరు రాజేష్‌కుమార్‌ పాల్గొన్నారు.   

Updated Date - 2020-12-20T05:23:55+05:30 IST