రవాణాశాఖ అధికారి తనిఖీలు

ABN , First Publish Date - 2020-03-24T11:34:13+05:30 IST

లాక్‌డౌన్‌లో భాగంగా జిల్లా రవాణాశాఖ అధికారులు విసృతంగా తనిఖీలు నిర్వహించారు. సోమవారం నిబంధనలకు విరుద్ధంగా సిరిసిల్లలో రోడ్లపై తిరుగుతున్న ఐదు వాహనాలను సీజ్‌ చేశారు.

రవాణాశాఖ అధికారి తనిఖీలు

సిరిసిల్ల, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌లో భాగంగా జిల్లా రవాణాశాఖ అధికారులు విసృతంగా తనిఖీలు నిర్వహించారు. సోమవారం నిబంధనలకు విరుద్ధంగా సిరిసిల్లలో రోడ్లపై తిరుగుతున్న ఐదు వాహనాలను సీజ్‌ చేశారు. రెండు ఆటోలు, మూడు మోటార్‌ క్యాబ్‌లు ఉన్నాయి. వీటికి సంబంధించిన లైసెన్స్‌ లను సస్పెన్షన్‌ చేయనున్నట్లు జిల్లా రవాణాశాఖ అధికారి కొండల్‌రావు తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెంద కుండా ప్రభుత్వం ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిందని, మోటారు సైకిళ్లు, ఆటోలు, పబ్లిక్‌, ప్రైవేటు సర్వీసులు, బస్సులు, మోటార్‌ క్యాబ్‌లు రోడ్లపై తిరగడానికి అనుమతి లేదని తెలిపారు. ఎమర్జెన్సీ వాహనాలకు మాత్రమే అనుమతులు ఉన్నాయని, దీనిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-03-24T11:34:13+05:30 IST