31లోపు ముంపుగ్రామాల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2020-12-20T04:35:47+05:30 IST

ఈనెల31లోపు ముంపు గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే కాంగ్రెస్‌పార్టీ పక్షాన ఉద్య మాలు తీవ్రతరం చేస్తామని టీపీసీసీ వర్కింగ్‌ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభా కర్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

31లోపు ముంపుగ్రామాల సమస్యలు పరిష్కరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్‌

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్‌ అర్బన్‌, డిసెంబరు 19: ఈనెల31లోపు ముంపు గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే కాంగ్రెస్‌పార్టీ పక్షాన ఉద్య మాలు తీవ్రతరం చేస్తామని టీపీసీసీ వర్కింగ్‌ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభా కర్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డీసీసీ కార్యాలయంలో శనివారం జరి గిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిడ్‌మానేరు ముంపుగ్రామాల బాధితుల సమస్యలను అసెంబ్లీ,శాసనమండలి సమావే శాల్లో లేవనెత్తాలని నెలకిందట కొడిముంజ గ్రామంలో సీఎల్‌పీ నేత భట్టివిక్రమార్క, ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డిలకు ప్రజలు విన్నవించారని, సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారని తెలిపారు. దీనిపై ప్రణాళికా సంఘం చైర్మన్‌ బీ వినోద్‌కుమార్‌ సిరిసిల్లలో అధికారులతో సమావేశం నిర్వహించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. అంతకుముందు కూడా చీఫ్‌సెక్రెటరీని కలిసి 12ముంపు గ్రామాల సమస్యలు తీర్చాలనికోరగా ఆయన కలెక్టర్‌కు ఫోన్‌చేయగా కొంతవరకు ఫైల్‌ కదిలినా మళ్లీ నిలిచిపోయిందన్నారు. ఇప్పటికైనా వినోద్‌కుమార్‌, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ స్పందించి ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించాలన్నారు. సిద్ధిపేట జిల్లాలో ముంపు గ్రామాలకు ఒక న్యాయం, మిడ్‌మానేరు ముంపు గ్రామాల ప్రజ లకు ఒక న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో వేముల వాడ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆది శ్రీనివాస్‌, చొప్పదండి నియోజకవర్గ ఇన్‌చార్జి మేడిపల్లి సత్యం, ముంపు గ్రామాల పోరాట సమితి నాయకులు కూస రవి, పిల్లి కనకయ్య, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-20T04:35:47+05:30 IST