-
-
Home » Telangana » Karimnagar » Today children are tomorrow community builders
-
నేటి బాలలే రేపటి సమాజ నిర్మాతలు
ABN , First Publish Date - 2020-11-28T05:29:06+05:30 IST
నేటి బాలలే రేపటి సమాజ నిర్మాతలని వేములవాడ మున్సిపల్ కమిషనర్ మట్ట శ్రీనివాసరెడ్డి అన్నారు.

వేములవాడ, నవంబరు 27 : నేటి బాలలే రేపటి సమాజ నిర్మాతలని వేములవాడ మున్సిపల్ కమిషనర్ మట్ట శ్రీనివాసరెడ్డి అన్నారు. సెంటర్ గుడ్ గవర్నెన్స్ ప్రాజెక్టు ఇన్‌చార్జి వినయ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో బాలల సంరక్షణ, హక్కులు, విపత్తులను ఎదుర్కొనే అంశాలపై అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీధి బాలలను రక్షించడంతోపాటు వారికి తగిన విద్యను అందించాలన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మధు రాజేందర్, కౌన్సిలర్లు సంగ హన్మవ్వ, యాచమనేని శ్రీనివాసరావు, నరాల శేఖర్, గోలి మహేశ్, కొండ శ్రీలత, అన్నారపు ఉమారాణి, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.