31లోపు పీఆర్సీని ప్రకటించాలి

ABN , First Publish Date - 2020-12-16T05:14:45+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31లోపు పీఆర్సీని ప్రకటించాలని టీఎన్జీవోస్‌ జిల్లా ఆధ్యక్షుడు మారం జగదీశ్వర్‌ డిమాండ్‌ చేశారు.

31లోపు పీఆర్సీని ప్రకటించాలి
సమావేశంలో మాట్లాడుతున్న టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షడు మారం జగదీశ్వర్‌

టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షడు మారం జగదీశ్వర్‌

తిమ్మాపూర్‌, డిసెంబరు 15: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31లోపు పీఆర్సీని ప్రకటించాలని టీఎన్జీవోస్‌ జిల్లా ఆధ్యక్షుడు మారం జగదీశ్వర్‌ డిమాండ్‌ చేశారు.లేఏకపోతే ఉద్యోగులంతా ప్రత్యేక్ష ఆందోళనకు దిగుతామని స్పష్టం చేశారు. మండలంలోని ఎల్‌ఎండీ కాలనీ ఎస్సారెస్పీ చీఫ్‌ ఇంజనీర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మారం జగదీశ్వర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఆర్సీ గడువు ఈ నెల 31తో ముగుస్తుందని, ఇప్పటికైనా నివేదికను విడుదల చేయాలని కోరుతున్నమన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఐఆర్‌ కూడా ప్రకటించలేదన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంతో మాట్లాడి సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధనాన్ని అమలు చేయాలని కోరారు.  70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు పీఆర్సీలో పొందుపరిచిన ప్రయోజనాలు అమలుచేయాలనికోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెల్‌నెస్‌ సెంటర్లలో మందులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్‌  దారం శ్రీనివాస్‌రెడ్డి, తిమ్మాపూర్‌ యూనిట్‌ అధ్యక్ష, కార్యదర్శులు మామిడి రమేష్‌, పోలు కిషన్‌, రాష్ట్ర కార్యదర్శి సంగెం లక్ష్మణ్‌రావు, రాగి శ్రీనివాస్‌, నాయకులు వొంటెల రవీందర్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, గంగారపు రమేష్‌, కుల్ల జయేందర్‌, సందీప్‌కుమార్‌, పుప్పాల అశోక్‌రెడ్డి, దూలం ధనలక్ష్మి, అరుణ జ్యోతి, పవిత్ర, కయ్యం శ్రీనివాస్‌, షానావజ్‌,సతీష్‌, గోపాల్‌ స్వామి, లచ్చయ్య, భూమయ్య, అజీజ్‌ పాల్గొన్నారు.

Read more