టీఎన్‌జీవోస్‌ కార్యవర్గం ఎన్నిక

ABN , First Publish Date - 2020-12-29T04:57:43+05:30 IST

మండలంలోని ఎల్‌ఎండీ కాలనీలో గల నీటి పారుదల శాఖ ఛీఫ్‌ ఇంజనీరింగ్‌ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం టీఎన్‌జీవోస్‌ తిమ్మాపూర్‌ యూనిట్‌ ఎన్నికలు జరిగాయి.

టీఎన్‌జీవోస్‌ కార్యవర్గం ఎన్నిక
కార్యవర్గాన్ని అభినందిస్తున్న నాయకులు

తిమ్మాపూర్‌, డిసెంబరు 28 : మండలంలోని ఎల్‌ఎండీ కాలనీలో గల నీటి పారుదల శాఖ ఛీఫ్‌ ఇంజనీరింగ్‌ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం  టీఎన్‌జీవోస్‌ తిమ్మాపూర్‌ యూనిట్‌ ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుడిగా తిరిగి నాలుగవ సారి మామిడి రమేష్‌ ఎన్నికయ్యారు. కార్యదర్శిగా పోలు కిషన్‌, కోశాధికారిగా అంబటి నాగరాజు, ఉపాద్యక్షులుగా కయ్యం శ్రీనివాస్‌, దూలం ధన లక్ష్మి, సల్వాటి శ్రీనివాస్‌, బొంతల రాజయ్య, బుర్ర శ్రీనివాస్‌, సంయుక్త కార్యదర్శు లుగా పుప్పాల అశోక్‌రెడ్డి, మన్నె సరిత, దూర్శెట్టి సత్యనారాయణ, పత్తెం శ్రీని వాస్‌, వి. కరుణాకర్‌, కార్యనిర్వాహక కార్యదర్శులుగా కామ సతీష్‌, ఆసంపల్లి భూమయ్య, ప్రచార కార్యదర్శులుగా ఆవుల లచ్చయ్య, ఎం.డి.అన్సర్‌ అలీ, కార్య వర్గ సభ్యులు అంగడి.రమేష్‌, పంజాల సారయ్య, చాడ ప్రత్యూష, పిట్టల లక్ష్మ య్య, ఎం.డి. ఇలియాస్‌ మొహిజుద్దీన్‌, ఎం.నాగరాజు, గంగిపల్లి వెంకట స్వామిలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఎస్‌.లక్ష్మణ్‌రావు ప్రకటించారు. నూతన కార్యవర్గ సభ్యులను టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు మారం జగధీశ్వర్‌, కార్యదర్వి మడిపెళ్లి కాళీచరణ్‌ సన్మానించి అభినందిచారు. జిల్లా నాయకులు వొంటెల రవీందర్‌రెడ్డి, వి.అమరేందర్‌ రెడ్డి, ప్రసాద్‌ రెడ్డి ఉన్నారు.

Updated Date - 2020-12-29T04:57:43+05:30 IST