-
-
Home » Telangana » Karimnagar » Timmapur is the last resort in the village
-
‘పల్లె ప్రగతి’లో తిమ్మాపూర్‌ది చివరి స్దానం
ABN , First Publish Date - 2020-03-13T12:05:12+05:30 IST
పల్లె ప్రగతి కార్యక్రమంలో జిల్లాలో తిమ్మాపూర్ మండలం చివరి స్దానంలో ఉందని కలెక్టర్ శశాంక అన్నారు.

కలెక్టర్ శశాంక
తిమ్మాపూర్, మార్చి 12: పల్లె ప్రగతి కార్యక్రమంలో జిల్లాలో తిమ్మాపూర్ మండలం చివరి స్దానంలో ఉందని కలెక్టర్ శశాంక అన్నారు. గురువారం మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో పల్లె ప్రగతి కార్యక్రమంపై అదికారులు, ప్రజా ప్రతినిధులతో కలెక్టర్ సమీకా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని సూచించారు. గ్రామాల్లో ఇంకుడుగుంతలు, మిషన్ భగీరఽథ, శ్మశానవాటికలు కంపోస్ట్ యార్డులు, డంపింగ్‌యార్డు పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అదికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి త్వరిత గతిన పనులను పూర్తి చేయాలని సూచించారు. వర్షాకాలం అరంభం కాగానే విరివిగా మొక్కలు నాటాలని చెప్పారు. గ్రామాలలో నర్సరీలను అభివృద్ధి చేయాలని సూచించారు. శ్మశానవాటికలు, డంపింగ్ యార్డుల ఏర్పాటుకు ప్రభుత్వ స్డలాలను గుర్తించాలని అన్నారు. ప్రభుత్వ స్థలాలు లేని చోట్ల దాతల సహకారంతో సేకరించాలని చెప్పారు.
వీలు కాకుంటే స్థలాలు కొనుగొలు చేయాలని కలెక్టర్ తెలిపారు. మిషన్ భగీరథ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈవో వెంకట మాధవరావు, డీఆర్‌డీవో వెంకటేశ్వర్‌రావు, డీపీవో రఘవరన్, తిమ్మాపూర్ ఎంపీపీ కేతిరెడ్డి వనిత, జడ్పీటీసీ ఇనుకోండ శైలజ, వైస్ ఎంపీపీ ల్యాగాల వీరారెడ్డి, తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీడీవో రవీందర్‌రెడ్డి, మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.