యాసిడ్‌ దాడిలో ముగ్గురు నిందితుల అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-12-26T06:13:55+05:30 IST

జగిత్యాల జిల్లాలో సంచలనం రేపిన మహిళపై యాసిడ్‌ దాడి ఘటనను పోలీసులు 24 గంటల్లో చేధించారు. ఇబ్రహీం పట్నం మండలం తిమ్మాపూర్‌ తండాకు చెందిన స్వాతిపై ఈ నెల 23న యాసిడ్‌ దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు.

యాసిడ్‌ దాడిలో ముగ్గురు నిందితుల అరెస్ట్‌
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ సింధుశర్మ

10వేల సుపారి తీసుకుని దాడి

వివరాలు వెల్లడించిన ఎస్పీ సింధుశర్మ

ఇబ్రహీంపట్నం, (మెట్‌పల్లి) డిసెంబరు 25 : జగిత్యాల జిల్లాలో సంచలనం రేపిన మహిళపై యాసిడ్‌ దాడి ఘటనను పోలీసులు 24 గంటల్లో చేధించారు. ఇబ్రహీం పట్నం మండలం తిమ్మాపూర్‌ తండాకు చెందిన స్వాతిపై ఈ నెల 23న యాసిడ్‌ దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. డీ ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సింధూ శర్మ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్ల డించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం స్వాతి భర్త 8 నెలల క్రితం మృతి చెం దాడు. డబ్బ గ్రామానికి చెందిన పుప్పల గజేంధర్‌ అనే వ్యక్తి వద్దకు స్వాతి వ్యవ సాయ పనులకు వెళ్తుండేది. దింతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి స్వాతితో గజేంధర్‌ ఫోన్‌లో మాట్లాడేవాడు. స్వాతి ఫోన్‌ బిజీ రావడంతో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. గత వారం రోజుల క్రితం స్వాతి తన స్వగ్రామమైన తిమ్మాపూర్‌ తండాలో ఫంక్షన్‌ ఉండటంలో అక్కడికి వెళ్లింది. విషయం తెలుసుకున్న గజేంధర్‌ ఈ నెల 23న స్వాతిని మాయ మాటలతో నమ్మించి తనతో పాటు మెట్‌పల్లి పట్టణానికి షాపింగ్‌ కోసం తీసుకవచ్చి తిరిగి తిమ్మాపూర్‌ తండా గ్రామ బస్టాండులో దింపడానికి ప్రయత్నించాడు. ముందస్తు పక్కా పథకంతో గజేంధర్‌ డబ్బ గ్రామానికి చెందిన దినేష్‌ అను వ్యక్తి, అమ్మక్క పేటకు చెందిన ప్రకాష్‌లకు 10 వేల సుపారి అందించి స్వాతిపై యాసిడ్‌ దాడికి ఒప్పందం కుదుర్చుకున్నారు.. ఈ క్రమంలో స్వాతిని మెట్‌పల్లికి తీసుకెళ్లి షాపింగ్‌ అనంతరం కారులో తిరుగు ప్రయాణంలో తండా శివారు ప్రాంతం వద్ద దించాడు. అప్పటికే పక్కా ప్లాన్‌తో తిమ్మాపూర్‌ తండాలో కాపు గాస్తున్న దినేష్‌, ప్రకాష్‌కు ఫోన్‌లో గజేందర్‌ సమాచారం అందించాడు. అప్రమత్తమైన ప్రకాశ్‌ తిమ్మాపూర్‌ తండాలో శివారుకు వచ్చి స్వాతిపై యాసిడ్‌తో దాడి చేసి కొద్ది దూరంలో ఉన్న దినేష్‌ బైక్‌పై పరారయ్యారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను 24 గంటల్లో పట్టుకున్నారు. వారి వద్ద నుంచికారు, ఒక బైక్‌, ఒక గ్లాస్‌ ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసీటి కేసుతో పాటు 307, 327 కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిం చినట్లు ఎస్పీ సింధూ శర్మ తెలిపారు. ఈ సమావేశంలో మెట్‌పల్లి డీఎస్పీ గౌస్‌ బాబా, సీఐ శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-26T06:13:55+05:30 IST