రైల్వే భూనిర్వాసితులకు నాయ్యం చేస్తాం

ABN , First Publish Date - 2020-02-08T12:11:01+05:30 IST

మండల కేంద్రంలో మూడో రైల్వే లైన్‌ నిర్మాణంలో భూములు, ఇండ్లు కోల్పోతున్న భూనిర్వాసితులను తప్ప కుండా న్యాయం చేస్తామని ఆర్డీఓ శంకర్‌కు మార్‌ అన్నారు.

రైల్వే భూనిర్వాసితులకు నాయ్యం చేస్తాం

  • బాధితులకు రూ.1.15 కోట్లు మంజూరు 8 ఆర్డీఓ శంకర్‌కుమార్‌


ఓదెల, ఫిబ్రవరి 7: మండల కేంద్రంలో మూడో రైల్వే లైన్‌ నిర్మాణంలో భూములు, ఇండ్లు కోల్పోతున్న భూనిర్వాసితులను తప్ప కుండా న్యాయం చేస్తామని ఆర్డీఓ శంకర్‌కు మార్‌ అన్నారు. మండల రెవెన్యూ కార్యాల యం వద్ద శుక్రవారం ఓదెలకు చెందిన 63 మంది రైల్వేలైన్‌ భూనిర్వాసితుల ఆర్డీఓ శం కర్‌ కుమార్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓదెల లో మూడో రైల్వే లైన్‌ నిర్మాణం నేపథ్యంలో భూములు కోల్పోతున్న 63 మందికి చెందిన 6.23 ఎకరాల మేరకు భూములు, ఇండ్లకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.1,15,93,648 మం జూరు చేసిందని, బాధితుల వివరాలను, కేటా యించిన నష్టపరిహారాన్ని చదివి వినిపించా రు. చట్టప్రకారం ప్రభుత్వం గజానికి రూ.180 చెల్లిస్తుందని, ఇందులో కమర్షియల్‌, వ్యవసా య భూములు ఉన్నాయని తెలిపారు. భూ ములకు మాత్రమే మూడురేట్లు పరిహారం వస్తుందని, ఇండ్లకు రాదని తెలిపారు. ఎకరా నికి రూ.7.50 లక్షల మేరకు అందే అవకాశం ఉందని, కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్ల దృష్టికి తీసుకెళుతానని తెలిపారు. ప్రస్తుతం లైన్‌ నిర్మాణ పనులను అడ్డుకోవద్దని, త్వరలోనే బాధితులకు న్యాయం జరుగుతుందని ఆర్డీఓ తెలిపారు.


పరిహారం చెల్లించే వరకు పనులు జరగనివ్వ..  రైల్వే లైన్‌ భూ నిర్వాసితులు

తమ జీవితానికి ఆధారమైన భూములు, ఇండ్లకు నష్టపరి హారం ఇచ్చే వరకు రైల్వే లైన్‌ నిర్మాణ పనులను జరగనివ్వమని ఓదెల కు చెందిన 63మంది భూ నిర్వాసితులు శుక్ర వారం ఆర్డీఓకు తెలిపారు. స్థలాలు ఇండ్లు కోల్పోయిన తరువాత తామంతా ఎక్కడికి వెళ్లి బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నా ళ్లు హోటళ్లు, దుకాణాలతో కుటుంబాలను పో షించుకుకున్నామని, ఇప్పుడు పరిహారం చె ల్లించకుంటే ఇండ్లను ఏ విధంగా కూల్చుతార ని ఆవేదన వ్యక్తం చేశారు.


ప్రభుత్వం చెల్లిం చే డబ్బుతో ప్రస్తుతం గుంట భూమి కొనుగో లు చేయలేమని బాఽధితులు ఆర్డీఓను ప్రశ్నిం చారు. ప్రభుత్వం చెల్లించే పరిహారం తమకు వద్దని, గజానికి రూ.500 చెల్లించాలని, అలాగే వ్యవసాయ భూమికి ఎకరానికి రూ.20 లక్షలు చెల్లించాలని కోరారు. ప్రస్తుత మార్కెట్‌ కన్న అతి తక్కువగా పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని అన్నా రు. ఎవరికి తెలియకుండానే సర్వే చేశారని, మాకు మెరుగైన పరిహారం చెల్లిస్తేనే స్థలాల ను అప్పగిస్తామని, గుంట భూమికి ఐదు లక్ష లు ఉంటే గజానికి రూ.180 చెల్లిస్తామనడం ఎంత వరకు సమంజసమని బాధితులు ఆర్డీఓ ముందు వాపోయారు. 

ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ రాంమో హన్‌, డిప్యూటీ తహసీల్దార్‌ వసంతరావు, ఆర్‌ఐ వినయ్‌, మాజీ సర్పంచ్‌ ఆకుల మ హేందర్‌, మాజీ ఎంపీటీసీ స్వామి తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-08T12:11:01+05:30 IST