రాష్ట్రంలో మతతత్వ శక్తులకు చోటు లేదు

ABN , First Publish Date - 2020-12-20T05:41:20+05:30 IST

ఉద్యమాలు, త్యాగల ద్వారా సాధించుకున్న తెలంగాణలో మతతత్వ శక్తులకు చోటు లేదని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు.

రాష్ట్రంలో మతతత్వ శక్తులకు చోటు లేదు
మాట్లాడుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌

 దేశ భక్తి పేర ప్రభుత్వరంగ సంస్థల నిర్వీర్యం

 సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

గోదావరిఖని, డిసెంబరు 19: ఉద్యమాలు, త్యాగల ద్వారా సాధించుకున్న తెలంగాణలో మతతత్వ శక్తులకు చోటు లేదని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. శనివారం గోదావరిఖనిలోని ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌కు తెలంగాణ రాష్ట్ర చరిత్ర తెలియదని, స్థానిక బీజేపీ నేతలు ఇ చ్చిన స్ర్కిప్ట్‌ చదివి వెళ్లిపోయాడన్నారు. ఎన్నికల్లో స్థానిక విషయాలు ప్రభావం చూపుతాయని, దుబ్బాక, జీహెచ్‌ఎంసీలో కూడా అదే జరిగిందన్నారు. హుజూర్‌నగర్‌ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్‌ కూడా రాలేదన్నారు. నాలుగు కార్పొరేటర్‌ సీట్లు గెలిచినంతమాత్రాన  మిడిసిపడవద్దన్నారు. రాష్ట్రంలో బీజేపీ నాయ కులు అధికారంలోకి వస్తామనుకోవడం పగటికలే అని ఉద్ఘాటించారు. తరుణ్‌చుగ్‌ వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎంపీ అయిన ఆయన రా జ్యాంగాన్ని ఉల్లంఘించేలా మాట్లాడుతున్నారన్నారు. టీఆర్‌ఎస్‌కు ఎన్నికలు కొత్త కాదని, రాష్ట్రం కోసం పదవులు త్యాగం చేసిన చరిత్ర టీఆర్‌ఎస్‌ది అన్నారు. రాష్ట్రంలో రెండు మున్సిపాలిటీలు మినహా అన్నీ మున్సిపాలిటీలు, మొత్తం జెడ్‌పీలను టీఆర్‌ఎస్‌ ఏకపక్షంగా గెలిచిందన్నారు. ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ ఓడిపోయిందని, ఆర్‌ఎస్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం నాగపూర్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం ఓడిపోయారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే అవినీతి అంటున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ చరిత్రలోనే అతి తక్కువ కాలంలో పూర్తి చేసి ప్రజలకు అందించిన చరిత్ర కేసీఆర్‌ ప్రభుత్వానిదన్నారు. అభివృద్ధి పనుల్లో అవినీతి అంటున్న బీజేపీ సెంట్రల్‌ విస్టాలో నూతన పార్లమెంట్‌ భవనానికి అంచనాలు పెరిగాయంటే అవినీతి జరిగిందా ప్రశ్నించారు. రూ.11,994కోట్లు అంచనా వేస్తే టెండర్‌ సమయానికి రూ.13,400కోట్లకు పెంచారని, పూర్తయ్యే సరికి రూ.15వేల కోట్లు అవుతుందన్నారు. కుటుంబ పాలన గురించి ఆరోపణ చేస్తున్న బీజేపీ నాయకులు నితీష్‌ గడ్కరి, వసుంధరరాజే, శివరాజ్‌సింగ్‌ వంటి బీజేపీ నాయకుల కుటుంబాలు రాజకీయాల్లో ఉన్న విషయాలు గుర్తుంచుకోవాలన్నారు. దేశ భక్తి పేరు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతున్నారని, రైల్వేలు, ఎయిర్‌లైన్స్‌లను ప్రైవేట్‌ పరం చేసి ఇప్పుడు ఎల్‌ఐసీని కూడా ప్రైవేట్‌ పరం చేసేందుకు సిద్ధపడ్డారన్నారు. బీజేపీ మతతత్వంతో లబ్ధిపొందాలని చూస్తోందని, మతతత్వశక్తుల ఆటలు రాష్ట్రంలో సాగవని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నా రు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలను వరద సహాయం పేర నమ్మించి ఓట్లు వేయించుకున్నారని, ఇప్పు డు ఎందుకు కుటుంబానికి రూ.25వేలు ఇవ్వడం లేద ని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌, కార్పొరేటర్లు సాగంటి శంకర్‌, బాల రాజ్‌కుమార్‌, మేకల సదానందం, కొమ్ము వేణు, పెంట రాజేష్‌, కో ఆప్షన్‌ సభ్యుడు వంగ శ్రీనివాస్‌, నాయకులు పీటీ స్వామి, పాతిపెల్లి ఎల్లయ్య, పీచర శ్రీనివాస్‌, నూతి తిరుపతి, కోట రవి, జేవీ రాజు, దు ర్గం రాజేష్‌, అచ్చె వేణు, పొన్నం లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-20T05:41:20+05:30 IST