‘తెర’వరా.. థియేటర్ల మూతతో వీధిన కార్మికులు
ABN , First Publish Date - 2020-07-27T20:48:28+05:30 IST
కరోనాతో సినిమా థియే టర్లు మూతపడి అందులో పనిచేసే కార్మికుల జీవి తాలు అగమ్యగోచరంగా మారాయి. వచ్చిన కొద్ది జీ తంతోనైనా కుటుంబాన్ని పోషించుకుని ఇన్నాళ్లు బ తుకు బండిని లాగించి ఇప్పుడు పూట గడవక ఇ బ్బందులు పడుతున్నాడు. డొక్కు సైకిల్ చేతబట్టుకుని ఓ వైపు..

కుటుంబం గడవడమే గగనం
కరోనాతో మారిన బతుకు చిత్రం
జగిత్యాల (ఆంధ్రజ్యోతి) : కరోనాతో సినిమా థియే టర్లు మూతపడి అందులో పనిచేసే కార్మికుల జీవి తాలు అగమ్యగోచరంగా మారాయి. వచ్చిన కొద్ది జీ తంతోనైనా కుటుంబాన్ని పోషించుకుని ఇన్నాళ్లు బతుకు బండిని లాగించి ఇప్పుడు పూట గడవక ఇ బ్బందులు పడుతున్నాడు. డొక్కు సైకిల్ చేతబట్టుకుని ఓ వైపు.. పొడవాటి నిచ్చెన పైనుంచుకుని.. ఈగలు ముసిరిన లైని వెంట పెట్టుకుని ఎన్నో ఏళ్లు గా రంగు రంగుల సినిమా పోస్టర్లు అంటిస్తూ జీవనాన్ని సాగిస్తున్న పోస్టర్ బాయ్స్ బతుకులు వెలవెలబోతున్నాయి. బ్లాక్ అండ్ వైట్ నుంచి రంగు రం గుల సినిమా ఎన్నో మైలురాళ్లు దాటినా ఇప్పటి పరిస్థితి ఎరుగదు. వాటిపై ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్న చిన్న ఉద్యోగుల బతుకులు కరోనా కాటుకు బలయ్యాయి.
రోడ్డున పడ్డ బతుకులు
తెలుగు సినిమా పరిశ్రమలో అనేక మార్పులు వచ్చాయి. 16 ఎంఎం నుంచి సినిమా స్కోప్ స్థా యికి పరిశ్రమ చేరింది. బ్లాక్ అండ్ వైట్ నుంచి మల్టీ కలర్ వరకు పరిశ్రమ ఎదిగింది. కానీ పోస్టర్లు అతికించే బాయ్స్ బతుకులు మారలేదు. ఇప్పు డు శాటిలైట్ ద్వారానే సినిమాలు నడిపిస్తున్నా సి నిమా ప్రచారం కోసం పోస్టర్ బాయ్స్ మాత్రం కా వాల్సిందే. మొత్తం సినిమా ఎపిసోడ్‌లో అనేక మా ర్పులు వచ్చినా పోస్టర్లు అతికించే బాయ్స్ జీవితా లు వెలసిన పోస్టర్లలాగే ఎండిపోతున్నాయి. మార్చి 22న జనతా కర్ఫ్యూతో థియేటర్లు మూత పడగా, కొన్ని పరిశ్రమలకు, హోటళ్లకు సడలింపులు ఇచ్చి నా సినీ పరిశ్రమకు ఇప్పటికీ ఎలాంటి సడలింపు లు లేవు. సినిమా థియేటర్లకు పూర్తిగా తాళాలు ప డ్డాయి. దీంతో దానిపై ఆధారపడిన వారి పరిస్థితు లు దయనీయంగా మారుతున్నాయి. ఎంత పెద్ద హీరో, హీరోయిన్‌ను పెట్టి సినిమా తీసినా, రూ. కో ట్లు నిర్మాతలు పెట్టుబడి పెట్టినా ఆ సినిమా ప్రజ ల్లోకి చేరాలంటే సినిమా థియేటర్ల కార్మికుల శ్రమ ఎంతో ఉంటుంది. జగిత్యాల జిల్లాలో 11 వరకు థి యేటర్లు ఉండగా, ఒక్కో థియేటర్‌లో పోస్టర్ అతి కించే బాయ్స్, థియేటర్లు క్లీన్ చేసేవారు, టిక్కెట్లు ఇచ్చేవారు, గేటు కీపర్‌లు ఇలా కలిసి ఒక్కో థియేటర్‌లో 10 నుంచి 15 మంది వరకు ఉంటారు. కరోనా ప్రభావం వల్ల వీరంతా ఇప్పుడు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. పోస్టర్ బాయ్స్‌లో కొందరికి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఇస్తారు. ఇం కొందరికైతే పోస్టర్లు వేస్తే రోజుకు రూ.500 చొప్పు న చెల్లిస్తుంటారు. నెలలో మూడు, నాలుగు రోజు లు మాత్రమే పని దొరకుతుంది. సినిమా మోజు తో కొందరు, పని దొరకక ఇంకొందరు అనేక ఏళ్లుగా ఈ పరిశ్రమలో పోస్టర్లు అతికిస్తూనే జీవిస్తున్నారు.
సినిమాలు నడిస్తేనే బతుకు: రత్నం, జగిత్యాల
ఎన్నో ఏళ్లుగా సినిమా థియేటర్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తూ జీవిస్తున్నా. ఇప్పుడు సినిమా థియేటర్లు బంద్ కావడంతో పైసలు లేక కష్టంగా ఉంది. నె లకు ఏడు వేల వేతనం వచ్చేది. ఇప్పుడు 3 వేలు ఇస్తున్నారు. కుటుంబం గడవడం కష్టంగా ఉంది.
పోస్టర్లు అతికిస్తేనే ఉపాధి: మహేష్, జగిత్యాల
ఆరేడు ఏళ్లుగా థియేటర్‌లో పనిచేస్తున్నా. నెల లో నాలుగైదు రోజులు పోస్టర్లు అతికించేవాన్ని. రో జుకు రూ.300 నుంచి రూ.500 వరకు ఇచ్చేవారు. మిగతా రోజుల్లో గేట్ కీపర్‌గా పని చేశా. అందుకు నెలకు రూ.3 వేలు ఇచ్చేవారు. ఇప్పుడు థియేటర్లు మూత పడటంతో పూట గడవని పరిస్థితి వచ్చింది.