చేతులెత్తేశారు..!

ABN , First Publish Date - 2020-08-12T10:17:20+05:30 IST

కరోనా వైరస్‌ కంట్రోల్‌ తప్పింది. నాయకుల నిర్లక్ష్యం, అధికారుల పట్టింపులేని ధోరణి వెరసి జిల్లాలో కరోనా వైరస్‌ వి జృంభిస్తోంది.

చేతులెత్తేశారు..!

జిల్లాలో విజృంభిస్తున్న వైరస్‌

పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కేసులు

800లకు చేరుకున్న బాధితులు

జిల్లాలో 13 మంది మృతి

పట్టణ ప్రాంతాల్లో జాడలేని చర్యలు


ఆంధ్రజ్యోతి, జగిత్యాల: కరోనా వైరస్‌ కంట్రోల్‌ తప్పింది. నాయకుల నిర్లక్ష్యం, అధికారుల పట్టింపులేని ధోరణి వెరసి జిల్లాలో కరోనా వైరస్‌ వి జృంభిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో రోజుకు పదుల సంఖ్యలోనే కేసులు బయట పడుతున్నా.. ఎలాం టి చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఇప్పటికే పాజిటివ్‌ కేసులు 800లకు చేరుకోగా, 13 మంది ఆ వైరస్‌ బా రిన పడి మృత్యువాత పడ్డారు. దీంతో ఆ కుటుంబాలు కోలుకోలేని పరిస్థితి నెలకొంది. కానీ అధి కారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


పట్టణ ప్రాంతాల్లో కరువైన చర్యలు

జిల్లాలో కరోనా వైరస్‌ రోజురోజుకూ విజృంభిస్తుండగా, జిల్లా వైద్యాధికారులు ఎలాంటి చర్య లు చేపట్టడం లేదు. కరోనా వైరస్‌ ప్రారంభంలో పాజిటివ్‌ వస్తే ఆ ప్రాంతంలోని పరిసరాలను శా నిటైజ్‌ చేసి ఇంటింటా వ్యాధి లక్షణాలు ఏమి ఉన్నాయో గుర్తించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండాపోయింది. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో రోజుకు పదుల సంఖ్యలోనే పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. ధర్మపురిలో కూడా రోజుకు రెండు, మూడు కేసులు బయట పడుతూనే ఉన్నాయి. జిల్లా కేంద్రమైన జగిత్యాలలోనైతే గడిచిన 15 రోజులుగా రోజుకు 15 నుంచి 20 పాజిటి వ్‌ కేసులు నమోదవుతున్నాయి. పట్టణంలోని ప లు ప్రాంతాల్లో నిత్యం పాజిటివ్‌ కేసులు వస్తు న్నా అధికారులు కనీసం శానిటైజ్‌ కూడా చేయ డం లేదు. పక్క జిల్లాలో కేసులు ఎక్కడైతే వెలుగులోకి వచ్చాయో ఆ ప్రాంతాన్ని కట్టుదిట్టం చేసి వైరస్‌ మరింతమందికి సోకకుండా దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. కానీ జగిత్యాల జిల్లాలో ని పట్టణాల్లో అధికారులు చేతులెత్తేశారు.


ప్రజాప్రతినిధుల పట్టింపులేని ధోరణి, అధికారుల నిర్ల క్ష్యంవల్లే జిల్లాలో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే జిల్లాలో రోజుకో చోట కరోనా వైరస్‌ బారిన పడి అమాయకులు మృ త్యువాత పడుతున్నారు. పట్టణంలోని పోచమ్మవాడలో మంగళవారం ఓ వ్యాపారి వైరస్‌ బారిన పడి మరణించాడు. ఈయన జీవనోపాధి కోసం బుగ్గారం మండలం నుంచి వచ్చి ఇక్కడ మరణించడంతో ఇప్పుడు ఆ కుటుంబం రోడ్డున పడినట్లయింది. కానీ అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం కనిపించడం లేదు.


జాడలేని సమీక్షలు

జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నా అధికా రులు, నాయకులు కనీసం కనీస చర్యలు తీసుకోకపోగా, సమీక్షలు చేయడం లేదనే విమర్శలు వె ల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్‌ ప్రారంభంలో జిల్లా మంత్రి ఈశ్వర్‌, కలెక్టర్‌తో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, అన్ని శాఖల అధికారులతో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు సమీక్ష నిర్వహించారు. కానీ ఇప్పుడు వైరస్‌ విజృంభిస్తున్నా ఎలాంటి స మీక్షలు కూడా జరుపడం లేదు. కరోనా వైరస్‌ జి ల్లాలో అదుపు తప్పుతుండగా, దానిని నియంత్రించేందుకు అటు అధికారులు, ఇటు నాయకు లు చర్యలు చేపట్టకపోవడంతో అమాయకులు బలవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు చొరవ తీసుకుని నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-08-12T10:17:20+05:30 IST