సంఘటితంగా గ్రామాన్నిఅభివృద్ధి చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-12-29T05:29:46+05:30 IST

గ్రామాల్లోని ప్రజలు సంఘటి తంగా కలిసి ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆర్డీవో వినోద్‌కుమార్‌, డీఎస్సీ గౌస్‌బాబాలు సూచించారు.

సంఘటితంగా గ్రామాన్నిఅభివృద్ధి చేసుకోవాలి
గ్రామస్థులతో మాట్లాడుతున్న ఆర్‌డీఓ, డీఎస్పీలు

ఆర్డీవో వినోద్‌కుమార్‌, డీఎస్పీ గౌస్‌బాబా

మల్లాపూర్‌, డిసెంబరు, 28 : గ్రామాల్లోని ప్రజలు సంఘటి తంగా కలిసి ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆర్డీవో  వినోద్‌కుమార్‌, డీఎస్సీ గౌస్‌బాబాలు సూచించారు. సోమవా రం మండలంలోని సంగెం శ్రీరాంపూర్‌ గ్రామంలో 24 కుటుం బాల సాంఘిక బహిష్కరణపై విచారణ చేపట్టారు. ఈ సంద ర్భంగా వారు గ్రామాభివృద్ధి కమిటీ బాధిత కుటుంబ సభ్యుల తో విచారణ చేపట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కా కుండా సంఘటితంగా కలిసి ఉండాలని హెచ్చరించారు. గ్రా మాల్లోని ప్రజలు కలిసిమెలిసుండాలన్నారు. గ్రామాల్లో నిర్వ హించే కార్యక్రమాల్లో కలిసి అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ఏ గ్రామంలోనైనా సాంఘిక బహిష్కరణ వంటి దుచ్చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కా ర్యక్రమంలో సీఐ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ రమేశ్‌, ఎస్సై రవీంధర్‌, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-29T05:29:46+05:30 IST