రాష్ట్రానికి వర్గీకరణలో అధికారం ఉంది

ABN , First Publish Date - 2020-09-18T06:09:06+05:30 IST

ఇటీవల సుప్రీంకోర్టు పంజాబ్‌ రాష్ట్రం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కులాల వర్గీకరణ విషయంలో అధికారం ఉన్నట్లు తీర్పు ఇచ్చిందని

రాష్ట్రానికి వర్గీకరణలో అధికారం ఉంది

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ


సుభాష్‌నగర్‌, సెప్టెంబరు 17: ఇటీవల సుప్రీంకోర్టు పంజాబ్‌ రాష్ట్రం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కులాల వర్గీకరణ విషయంలో అధికారం ఉన్నట్లు తీర్పు ఇచ్చిందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. గురువారం నగరంలోని టీఎన్‌జీవో ఫంక్షన్‌హాల్‌లో ఎమ్మార్పీఎస్‌ ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఉద్యమాన్ని చేపట్టామని అన్నారు. 2002నుంచి 2004వరకు వర్గీకరణను ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసి, దానికి చట్టబద్ధత లేదని అప్పటి ప్రభుత్వం వర్గీకరణ అంశాన్ని పక్కనపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.


ప్రస్తుతం పంజాబ్‌ విషయంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు కులాల వర్గీకరణ చేయడంలో అధికారం ఉందని తెలిపినప్పటికీ మన తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణ విషయంలో తన వైఖరిని తెలపకపోవడం శోచనీయమన్నారు. వెంటనే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 2023లో ఎంఎస్‌పీ ఆధ్వర్యంలో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతిగా నిలుస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-18T06:09:06+05:30 IST