కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2020-06-23T10:18:18+05:30 IST

కరోనా ను అరికట్టడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో పె ద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని,

కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ

జిల్లాలోని ఆస్పత్రుల ఎదుట బీజేపీ నేతల ఆందోళన


కళ్యాణ్‌నగర్‌/పెద్దపల్లిరూరల్‌/ ధర్మారం, జూన్‌ 22: కరోనా ను అరికట్టడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో పె ద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని, నందిమేడారం ప్రభుత్వాస్పత్రి, రాగినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ధర్నా నిర్వహించారు. గోదావరి ఖనిలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ, మాజీ మంత్రి బోడ జనార్దన్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గాంధీ ఆసుపత్రిని తనిఖీ చేసే సమయం దొరకడం లేదని, డాక్టర్లకు పీపీఈ కిట్లు, మాస్క్‌లు అందించకపోవడంతో డాక్టర్లు కరోనా భారిన పడుతున్నారని ఆరోపిం చారు.


కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, క్వారంటైన్‌లో ఉన్న వారికి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు. కరోనా అరిక్టడంలో ముందున్న డాక్టర్లు, జర్నలిస్టులకు, పోలీసులకు, పారిశుధ్య కార్మికులకు రక్షణ పరికరాలు అందించాలని డిమాండ్‌ చేశారు. కరో నా వ్యాధిని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని డి మాండ్‌ చేశారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. బీజేపీ నాయకులు బల్మూరి వనిత, అమరేందర్‌రావు, తంగెడ రాజేశ్వర్‌రావు, శిలారపు పర్వతా లు, ధర్మారం బీజేపీ మండల అధ్యక్షుడు యాల్ల తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. 

Read more