పారిశుధ్య కార్మికుల సేవలు వేలకట్టలేనివి...

ABN , First Publish Date - 2020-05-17T10:31:35+05:30 IST

ఆపత్కాల సమయంలో విధులను నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు వేలకట్టలేనివని అదనపు కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌లాల్‌

పారిశుధ్య కార్మికుల సేవలు వేలకట్టలేనివి...

అదనపు కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌లాల్‌ 


హుజూరాబాద్‌రూరల్‌, మే 16:  ఆపత్కాల సమయంలో  విధులను నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు వేలకట్టలేనివని అదనపు కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌లాల్‌ అన్నారు. శనివారం పట్టణంలోని సాయిరూప గార్డెన్‌లో మున్సిపల్‌  పారిశుధ్య సిబ్బందికి, వాటర్‌ సప్లై సిబ్బందికి సహపంక్తి భోజనాలను  ఏర్పాటు చేశారు.


ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హజరై పారిశుధ్య కార్మికులతో కలిసి భోజనం చేశారు. అనంతరం మాట్లాడుతూ వైద్యులు, పారిశుధ్య కార్మికులు, పోలీసుల కృషి వల్లనే జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గిపోయాయన్నారు. అనంతరం బోర్నపల్లి శివారులోని ఓ రైస్‌ మిల్లును తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో బెన్‌షాలోము, తహసీల్దార్‌ బావుసింగ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల, మున్సిపల్‌ కమిషనర్‌ ఈసంపల్లి జోనా, వార్డు కౌన్సిలర్లు, అధికారులు తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-05-17T10:31:35+05:30 IST