-
-
Home » Telangana » Karimnagar » The problems of the flooded villages need to be solved
-
ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2020-11-25T05:41:33+05:30 IST
మిడ్‌మానే రు ముంపు గ్రామాల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ మంగళ వారం సిరిసిల్ల ఆర్డీవో శ్రీనివాసరావుకు మిడ్ మానేరు ముంపు గ్రామాల ఐక్య వేదిక నాయ కులు, గ్రామస్థులు వినతిపత్రాన్ని అందించా రు.

సిరిసిల్ల టౌన్, నవంబరు 24: మిడ్‌మానే రు ముంపు గ్రామాల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ మంగళ వారం సిరిసిల్ల ఆర్డీవో శ్రీనివాసరావుకు మిడ్ మానేరు ముంపు గ్రామాల ఐక్య వేదిక నాయ కులు, గ్రామస్థులు వినతిపత్రాన్ని అందించా రు. ఈ సందర్భంగా ఐక్య వేదిక అధ్యక్షుడు కూస రవీందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పిల్లి కనకయ్య లు మాట్లాడుతూ మిడ్ మా నేరు ముంపు గ్రామాల సమ స్యలను 15 రోజుల్లో పరి ష్కారం చూపుతామని చెప్పి నేటికీ పరిష్కరించలేదని వా పోయారు. 2015లో సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్న దర్శనం చేసుకోని రాజన్న సాక్షిగా హామీలు ఇచ్చారని ముంపు గ్రామస్థులకు డబుల్ బెడ్‌రూంలు కూడా ఇస్తానన్న హామీని ఇప్పటికీ నేరవేర్చలే దన్నారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, ఇవ్వా లని, యువతీ, యువకులకు ఉపాధి మార్గా న్ని చూపించాలని కోరారు. కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు హరికృష్ణ, నాగరాజు త దితరులు పాల్గొన్నారు.