పేదలను ప్రభుత్వమే ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-04-21T10:02:40+05:30 IST

లాక్‌డౌన్‌తో ఇబ్బందిపడుతున్న పేదలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ప్రదేశ్‌ కాం గ్రెస్‌ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

పేదలను ప్రభుత్వమే ఆదుకోవాలి

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌


వేములవాడ, ఏప్రిల్‌ 20: లాక్‌డౌన్‌తో ఇబ్బందిపడుతున్న పేదలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ప్రదేశ్‌ కాం గ్రెస్‌ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ డిమా ండ్‌ చేశారు. సోమవారం వేములవాడలో విలేకరులతో మాట్లాడారు. పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వాలకు వ స్తున్న కోట్లాది రూపాయల విరాళాలు ఎటు పోతున్నాయో తెలియడం లేదన్నారు. ఒక్కో వ్యక్తికి 12 కిలోల బియ్యం, 1500 రూపాయల నగదు మినహా ఎలాంటి సహాయమూ అందలేదన్నారు.


సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్లలో గొప్పలు చెప్పుకుంటున్నారని, పేదలకు బదులుగా పారిశ్రామిక రం గాలకు రాయితీలు ప్రకటిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆది శ్రీనివాస్‌, చందుర్తి జడ్పీ టీసీ నాగం కుమార్‌  పాల్గొన్నారు.  టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నాయకులు కుంతియా, శ్రీనివాసన్‌ కృష్ణన్‌ తదితరులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆది శ్రీనివాస్‌తో చర్చించి వేములవాడ పట్టణంలోని కట్టడి ప్రాంత ప్రజల పరిస్థితిపై తెలుసుకున్నారు. 

Updated Date - 2020-04-21T10:02:40+05:30 IST