పేదల ఆకలి తీర్చడం ఆనందంగా ఉంది

ABN , First Publish Date - 2020-04-26T10:33:33+05:30 IST

నిరుపేద ఆకలితీర్చడం ఆనందంగా ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

పేదల ఆకలి తీర్చడం ఆనందంగా ఉంది

మంత్రి గంగుల కమలాకర్‌


కరీంనగర్‌టౌన్‌/కరీంనగర్‌రూరల్‌/భగత్‌నగర్‌/కరీంనగర్‌ కల్చరల్‌/ సుభాష్‌నగర్‌, ఏప్రిల్‌ 25: నిరుపేద ఆకలితీర్చడం ఆనందంగా ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శనివారం నగరంలోని టెలిఫోన్‌ క్వార్టర్స్‌ వద్ద టూవీలర్‌ మెకానిక్‌ సంఘం అధ్యక్షుడు తోడెటి బాబు ఆధ్వర్యంలో మెకానిక్‌లకు నిత్యావసర సరుకులను అందజేశారు. షీటీం ఏఎస్సై విజయమణి దాతగా బస్టాండ్‌లో షీటీం ఇన్‌చార్జి సీఐ దామోదర్‌రెడ్డి చేతుల మీదుగా అల్పాహారం పంపిణీ చేశారు.


సేవాభారతి, ఆర్‌ఎస్‌ఎస్‌ కరీంనగర్‌ శాఖ ఆధ్వర్యంలో కొత్తపల్లి, రుక్మాపూర్‌ గ్రామాల్లో పేదలకు 12 రకాల నిత్యావసర సరుకులను జిన్నా సత్యనారాయణరెడ్డి, పింగిలి వెంకటరమణారెడ్డి, గొల్లె తిరుపతి పంపిణీ చేశారు. మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో భోజనం పంపిణీ చేశారు. వికాసతరంగిణి విద్యానగర్‌, సప్తగిరికాలనీ శాఖల ఆధ్వర్యంలో టుటౌన్‌ పోలీసుస్టేషన్‌లో సీఐ దేవారెడ్డికి మాస్కులు, శానిటైజర్‌ బాటిల్స్‌ అందజేశారు. 38వ డివిజన్‌లో శ్రీహరినగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. తెలంగాణ పంచాయతీరాజ్‌ మినిస్టీరియర్‌ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులకు జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. డీటీఎఫ్‌ ఆధ్వర్యంలో సప్తగిరి కాలనీలోని లారెల్‌ ఉన్నత పాఠశాలలో అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ చేతుల మీదుగా వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.


42వ డివిజన్‌లో కార్పొరేటర్‌ మేచినేని వజన అశోక్‌రావు మున్సిపల్‌ కార్మికులకు నిత్యావసరాలు అందజేశారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్‌ ఆధ్వర్యంలో 23, 24 డివిజన్‌లో నిత్యావసర వస్తువులు అందజేశారు. కొత్తపల్లి మండలం రేకుర్తిలోని రెడీమిక్స్‌ ప్లాంట్‌లో పనిచేస్తున్న కూలీలకు బీజేపీ నాయకుడు జాడిబాల్‌రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. శ్రీ సేవామార్గ్‌ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు మునిపల్లి ఫణిత ఆధ్వర్యంలో కరీంనగర్‌-1 డిపోలో నిత్యావసర సరుకులు అందజేశారు.


ఒకటో డివిజన్‌లో కార్పొరేటర్‌ కొలగాని శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయ ణరావు పంపిణీ చేశారు. ఎస్‌ఆర్వో, ఆర్‌ఎంఎస్‌ కరీంనగర్‌ సిబ్బంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, క్యాజువల్‌ లేబర్‌కు నిత్యావసర సరుకులను అందజేశారు.


Updated Date - 2020-04-26T10:33:33+05:30 IST