రాజన్న క్షేత్రంలో భక్తుల సందడి

ABN , First Publish Date - 2020-07-20T10:49:40+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. కరోనా నిబంధ నలతో లఘుదర్శనం అమలు చేస్తుండడంతో భక్తులు

రాజన్న క్షేత్రంలో భక్తుల సందడి

ఘనంగా మహాలింగార్చన


 వేములవాడ, జూలై 19: వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. కరోనా నిబంధ నలతో లఘుదర్శనం అమలు చేస్తుండడంతో భక్తులు నందీశ్వరుడి విగ్రహం వద్ద నుంచి రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా ఆర్జిత సేవలు బుక్‌ చేసుకున్న భక్తుల పేరిట ఆలయ అర్చకులు పూజలు చేశారు. మాస శివరాత్రి సందర్భంగా ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ నేతృత్వంలో అర్చకులు, వేదపండితులు రాజరాజేశ్వరస్వామికి ఉదయం మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం స్వామివారి కల్యాణ మండపంలో పిండితో రూ పొందించినప్రమిదలతో  జ్యోతులు వెలిగించి మహాలింగార్చన నిర్వహించారు. 

Updated Date - 2020-07-20T10:49:40+05:30 IST