హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-08-01T11:07:46+05:30 IST

ఆయాశాఖలకు నిర్ణయించిన హరితహారం లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్‌ కె శశాంక అన్నారు.

హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలి

కలెక్టర్‌ కె శశాంక


కరీంనగర్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఆయాశాఖలకు నిర్ణయించిన హరితహారం లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్‌ కె శశాంక అన్నారు. శుక్రవారం తన చాంబర్‌లో హరితహారంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వివిధశాఖల వారిగా సాధించిన హరితహారం పురోగతిపై చర్చించి లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.


ఆస్పత్రుల్లో పడకల సంఖ్య పెంచాలి..

సుభాష్‌నగర్‌: కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రిలో పడకల సంఖ్య పెంచి వసతులు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ కె శశాంక అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కొవిడ్‌ జిల్లా కోర్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆక్సిజన్‌తో కూడిన పడకల సంఖ్యను త్వరితగతిన పెంచాలని ఆదేశించారు. వైద్యులను ఎక్కువ సంఖ్యలో కొవిడ్‌ వార్డులో నియమించాలని అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ సుజాత, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రత్నమాల, జిల్లా టీబీ అధికారి డాక్టర్‌ కేవీ రవీందర్‌రెడ్డి, ఐసీడీఎస్‌ అధికారి డాక్టర్‌ జ్యోతి, వైద్యాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-01T11:07:46+05:30 IST