నిరుపేదలకు అండగా నిలువడం ప్రభుత్వ ధ్యేయం
ABN , First Publish Date - 2020-04-25T10:15:45+05:30 IST
నిరుపేదలకు అండగా నిలువడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్
పారిశుద్ధ్య కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం
జగిత్యాల టౌన్, ఏప్రిల్ 24: నిరుపేదలకు అండగా నిలువడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం దేవిశ్రీ గార్డెన్‌లో రాజరాజేశ్వర గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో పారిశుధ్య కా ర్మికులకు భోజన వసతి ఏర్పాటు చేయగా, ఎమ్మెల్యే సంజయ్ కుమా ర్, బల్దియా చైర్ పర్సన్ బోగ శ్రావణిలు కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
అల్లం మహేష్ ఆధ్వర్యంలో ఎస్‌కే ఎన్‌ఆర్ కళాశాల సమీపంలోని నిరుపేదలకు ఆహార పొట్లాలు అందజేశారు. పట్టణంలో ని బీట్ బజార్‌కు చెందిన స్నేహమిత్ర యూత్ సభ్యులు 500 మంది వలస కూలీలు, నిరుపేదలకు చికెన్ బిర్యానీతో పాటు మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అందజేశారు.