విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-12-11T05:22:40+05:30 IST

ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీ ర్యం చేస్తోందని యూఎస్‌పీ ఎస్‌, జాక్టో నాయకులు అన్నారు.

విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన ఉపాధ్యాయులు

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌, డిసెంబరు 10: ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీ ర్యం చేస్తోందని యూఎస్‌పీ ఎస్‌, జాక్టో నాయకులు అన్నారు. గురువారం సిరిసిల్ల ప ట్టణంలోని శివనగర్‌ ప్రభు త్వ,  బాలికల ఉన్నత పాఠ శాలల్లో మధ్యాహ్నా భోజన విరామ సమయంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సం ఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయుల పదో న్నతులు, బదిలీలు చేపట్టాలని నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పా కాల శంక ర్‌గౌడ్‌, కుమ్మరి మల్లే శం, నారాయణ, లక్ష్మణ్‌, శివకుమార్‌, ఎలగొండ రవి, నషీరుద్దీన్‌, నారాయణ, నాగరాజు, శ్రీనివాస్‌, రాజ లింగం, నారాయణ, రామచందర్‌ రావు, భాగ్యరేఖ, అంజన్‌రెడ్డి, మంజుల, అర్చన  పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-11T05:22:40+05:30 IST