కరీంనగర్ సుందరీకరణే లక్ష్యం
ABN , First Publish Date - 2020-12-21T04:59:02+05:30 IST
కరీంనగర్‌ను సుందర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం నగరంలోని 14వ డివిజన్‌లో పట్టణ ప్రగతి నిధులు రూ.20లక్షలతో మున్సిపల్ పార్క్ అభివృద్ధి పనులకు మేయర్ వై సునీల్‌రావుతో కలిసి భూమిపూజ చేశారు.

14వ డివిజన్‌లో భూమిపూజ
మంత్రి గంగుల కమలాకర్
భగత్‌నగర్, డిసెంబరు 20: కరీంనగర్‌ను సుందర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం నగరంలోని 14వ డివిజన్‌లో పట్టణ ప్రగతి నిధులు రూ.20లక్షలతో మున్సిపల్ పార్క్ అభివృద్ధి పనులకు మేయర్ వై సునీల్‌రావుతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఉన్న మున్సిపల్ పార్కుస్థలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడి వాటిని అహ్లాదకరంగా అభివృద్ధి చేస్తామన్నారు. నగరపాలక సంస్థ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 20పార్కులను అభివృద్ధి చేసి ప్రజల కిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామన్నారు. నగరంలోని మట్టి రోడ్లన్నింటినీ సీసీరోడ్లుగా మార్చుతున్నా మన్నారు. లింకురోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. తెలంగాణలో ప్రతి రోజు మంచినీరు అందించే ఏకైక కార్పొరేషన్ కరీంన గర్ అన్నారు. కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, డిప్యూటీమేయర్ చల్ల స్వరూపారాణి, కార్పొరేటర్లు దిండిగాలమహేష్, బండారి వేణు, చాడగొండ బుచ్చిరెడ్డి, ఐలేందర్ యాదవ్, కో-అప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.