మొదటి రోజు ఉమ్మడి జిల్లాలో ఒకే లావాదేవి

ABN , First Publish Date - 2020-12-15T05:33:22+05:30 IST

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు సోమ వారం ప్రారంభమైనప్పటికి మొదటి రోజు కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా ఒకే లావాదేవి జరిగింది. గంగాధర సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఒక ఆస్తి మార్ట్‌గేజ్‌ రిజిస్ట్రేషన్‌ జరిగింది.

మొదటి రోజు ఉమ్మడి జిల్లాలో ఒకే లావాదేవి
పాత పద్ధతిలో ఆస్తుల రిజిస్ట్రేషన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ కార్యాలం ఎదుట నిరీక్షిస్తున్న ప్రజలు

గంగాధరలో ఒక మార్ట్‌గేజ్‌ 

11 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్లాట్‌బుకింగ్‌ నిల్‌

కరీంనగర్‌ క్రైం, డిసెంబరు 14: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు సోమ వారం ప్రారంభమైనప్పటికి మొదటి రోజు కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా ఒకే లావాదేవి జరిగింది. గంగాధర సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఒక ఆస్తి మార్ట్‌గేజ్‌ రిజిస్ట్రేషన్‌ జరిగింది. సిరిసిల్ల సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఒక ఆస్తి రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌బుక్‌ చేసుకున్నా సరైన పత్రాలు లేకపోవడం, ఇతర సాంకేతిక కారణాలతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రజల ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ధరణితో సంబంధం లేకుండా వ్యవసాయేతర ఆస్తుల ను పాత పద్ధతి (కార్డ్‌) ద్వారా రిజిస్ట్రేషన్లు చేయాలని హైకోర్టు సూచించింది.  ఇక పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేస్తారని ప్రజలు భావించారు. ఈ మేరకు ఆస్తుల రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుకింగ్‌ చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో ప్రయత్నించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ఉంటేనే స్లాట్‌బుకింగ్‌ చేసుకునే అవకాశం ఉందని మెసేజ్‌ రావడంతో ప్రజలు ఖంగుతిన్నారు. దీంతో ఆస్తుల రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుకింగ్‌లు కాలేదు. మరో వైపున సోమవారం అమావాస్య కారణంగా ఎల్‌ ఆర్‌ఎస్‌ ఉన్నవారూ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను వాయిదా వేసుకున్నట్లు సమాచారం. 

స్లాట్‌ బుకింగ్‌కు ఎల్‌ఆర్‌ఎస్‌ తప్పనిసరి

సోమవారం ఉ దయమే వివిధ ప్రాంతాల నుంచి ఆస్తులు విక్రయిం చిన, కొనుగోలు చే సిన వారు కరీం నగర్‌ సబ్‌ రిజిస్ట్రా ర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. కో ర్టు పాత పద్ధతి లోనే ఆస్తులను రి జిస్ట్రేషన్‌ చేయాలని సూచించినా ఎందుకు చేయటంలేదని అధికారులను ప్ర శ్నించారు. పాత పద్ధతి అంటే స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని, దానికి ఎల్‌ఆర్‌ఎస్‌ తప్పక ఉండాలని అధికారులు చెప్పడంతో వారు ఊసురుమంటూ వెను దిరిగారు. మంగళవారం, బుధవారాల్లో పెద్ద ఎత్తున ఆస్తుల రిజిస్ట్రేషన్‌ల కోసం ప్రజలు స్లాట్‌బుక్‌ చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో ప్రయత్నిస్తున్నారు. రోజు కు గరిష్టంగా 24 స్లాట్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ లెక్కన 3 నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్‌లు కావాలంటే చాలా కాలంపట్టే అవకాశమున్నది. 

Updated Date - 2020-12-15T05:33:22+05:30 IST