రైతు వేదిక నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి

ABN , First Publish Date - 2020-09-05T08:08:27+05:30 IST

రైతు వేదిక నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని కలెక్టర్‌ గుగులోతు రవి అన్నారు...

రైతు వేదిక నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి

కలెక్టర్‌ గుగులోతు రవి


ధర్మపురి, సెప్టెంబరు 4: రైతు వేదిక నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని కలెక్టర్‌ గుగులోతు రవి అన్నారు. మండలంలోని రాజారం, జైనా, తిమ్మాపూర్‌ గ్రామాల్లో చేపట్టిన రైతు వేదిక నిర్మాణ ప నులను జగిత్యాల ఆర్‌డీవో మాధురితో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ రైతు వేదిక నిర్మాణాలు పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠి న చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఆయన వెంట పీఆర్‌ ఈఈ రహమాన్‌, డీఈఈ లక్ష్మణ్‌రా వు, ఎంపీడీవో నరేష్‌కుమార్‌, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు


ఆన్‌లైన్‌ క్లాసులు సద్వినియోగం చేసుకోవాలి

వెల్గటూర్‌ : కరోనా కారణంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ క్లాసులను విద్యార్థులు సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్‌ రవి సూచించారు. శుక్రవారం ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్న మండల కేంద్రం లోని పలువురి విద్యార్థుల ఇళ్లకు వెళ్లి కలెక్టర్‌ ఆరా తీశారు. కార్యక్రమంలో ఆర్డీవో మాధురి, తహసీల్దా ర్‌ రాజేంధర్‌, ఎంపీడీవో సంజీవ్‌రావు, ఎంఈవో భూమయ్య, ఎంపీపీ లక్ష్మిలింగయ్య, జడ్పీటీసీ సుధా రామస్వామి, సర్పంచ్‌ మురళి పాల్గొన్నారు.


Updated Date - 2020-09-05T08:08:27+05:30 IST