కాళేశ్వరం లింక్-2 నిర్మాణం నిలిపివేయాలి
ABN , First Publish Date - 2020-12-12T05:04:34+05:30 IST
కాళేశ్వరం లింక్-2 ప్రాజెక్ట్ నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయాలని పెగడపెల్లి మండలంలోని పలు గ్రా మాల రైతులు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఆందోళన చేప ట్టారు.
కలెక్టరేట్ ఎదుట పెగడపల్లి వాసుల ఆందోళన
జగిత్యాల అర్బన్, డిసెంబరు 11: కాళేశ్వరం లింక్-2 ప్రాజెక్ట్ నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయాలని పెగడపెల్లి మండలంలోని పలు గ్రా మాల రైతులు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఆందోళన చేప ట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెగడపెల్లి మండలం నా మాపూర్, నందగిరి, ఏడు మూటలపల్లి గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్-2 ప్యాకేజీ నిర్మాణం కింద మూడు గ్రామాల్లో సుమారు 250 ఎక రాల భూమిని చిన్న, సన్నకారు రైతులే కోల్పోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు రైతు పక్షపాతిని అంటూనే ప్రాజెక్టుల పేరుతో భూములు లాక్కుంటూ, బతుకులను రోడ్డుకు ఈడుస్తున్నారన్నారు. ప్రా జెక్ట్ నిర్మాణం కోసం తక్కువ ధరకు భూములు సేక రించారని ఆరోపిం చారు. లింకేజీ ప్రాజెక్ట్ నిర్మాణం వెంటనే ఆపాలని, లేదా లింక్2 ప్రాజెక్ట్ కోసం భూసేకరణ రద్దుపర్చి, అండర్ టన్నెల్ నిర్మాణం పనులు చేపట్టా లని రైతులు డిమాండ్ చేశారు. లింకేజీ ప్రాజెక్ట్ నిర్మాణం పట్ల సీఎం కే సీఆర్ పునరాలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమరేంధర్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, పాలోజీ గంగారాం, తిరుపతి రెడ్డి, రవీంధర్‌రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సత్యనారాయణరెడ్డి, రామకృష్ణరెడ్డి, మల్లేశం, శ్రీనివాస్‌యాదవ్, గం గయ్య, రాములు, రాజిరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులున్నారు.