నగరంలో ముమ్మరంగా హరితహారం

ABN , First Publish Date - 2020-08-01T11:08:31+05:30 IST

హరితహారం ఆరోవిడత కార్యక్రమం నగరంలో ముమ్మరంగా సాగుతోందని మేయర్‌ వై.సునీల్‌రావు అన్నారు.

నగరంలో ముమ్మరంగా హరితహారం

60శాతం వరకు ఎవెన్యూ ప్లాంటేషన్‌ పూర్తి 

మేయర్‌ వై.సునీల్‌రావు 


కరీంనగర్‌ టౌన్‌, జూలై 31: హరితహారం ఆరోవిడత కార్యక్రమం నగరంలో ముమ్మరంగా సాగుతోందని మేయర్‌ వై.సునీల్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన 60వ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో కార్పొరేటర్‌ వాల రమణారావుతో కలిసి మొక్కలునాటారు. అనంతరం ఇంటింటికి వెళ్లి మూడు పండ్లు, మూడు పూల మొక్కలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకు అన్ని డివిజన్లలో కార్పొరేటర్ల సహకారంతో 60శాతం ఎవెన్యూ ప్లాంటేషన్‌ పూర్తి చేశామని, మిగిలిన 40శాతం మొక్కలను కూడా యుద్ధప్రాతిపదికన నాటుతామనిచెప్పారు. స్మార్ట్‌సిటీ పథకంలో భాగంగా 38వ డివిజన్‌లో ఏర్పాటు చేసిన వీధిదీపాలు, హైమాస్ట్‌లైట్లను మేయర్‌ వై.సునీల్‌రావు కార్పొరేటర్‌ సరిళ్లప్ర సాద్‌తో కలిసి శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు.


రిటైర్డు ఉద్యోగికి ఘన సన్మానం. 

నగరపాలక సంస్థలో 31సంవత్సరాలుగా నాల్గవ తరగతి ఉద్యోగిగా పనిచేసి శుక్రవారం పదవీ విరమణ చేసిన కుర్ర రాజయ్య దంపతులను మేయర్‌ వై.సునీల్‌రావు, కమిషనర్‌ వల్లూరి క్రాంతి ఘనంగా సన్మానించారు. రెవెన్యూ విభాగం నుంచి సేకరించిన 25వేల రూపాయల నగదు చెక్కును రాజయ్యకు అందజేశారు.

Updated Date - 2020-08-01T11:08:31+05:30 IST