రైతులను విస్మరిస్తున్న కేంద్ర ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-12-06T05:44:02+05:30 IST

రైతులను విస్మరించి కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు.

రైతులను విస్మరిస్తున్న కేంద్ర ప్రభుత్వం
దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకుంటున్న పోలీసులు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి

భగత్‌నగర్‌, డిసెంబరు 5: రైతులను విస్మరించి కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. శనివారం కమాన్‌ చౌరస్తాలో ప్రధానమంత్రి దిష్టిబొమ్మను దహనం చేయడానికి యత్నించిన సీపీఐ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం కమాన్‌ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజా, రైతువ్యతిరేక, కార్మిక వ్యతిరేకచట్టాలను తీసుకు వచ్చి దేశ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. కొన్ని రోజులుగా ఢిల్లీలో అనేక రాష్ట్రాలకు చెందిన రైతులు ఆందోళన చేస్తుంటే ప్రధానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. ఈనెల8న భారత్‌ బంద్‌కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయన్నారు. బంద్‌ను జయప్రదం చేసేం దుకు ప్రజలు, కార్మికులు సంఘటితం కావాలన్నారు. కార్యక్ర మంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి, కొయ్యడ సృజన్‌ కుమార్‌, అందె స్వామి, అశోక్‌, జ్యోతి, లక్ష్మి, టేకుమల్ల సమ్మయ్య, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

మహిళలు రాజకీయ చైతన్యం సాధించాలి..

మహిళలు స్వయంశక్తితో ఎదగాలంటే రాజకీయ చైతన్యం సాధించాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడవెంకట్‌రెడ్డి అన్నారు. శని వారం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో భారత జాతీయ మహిళాసమాఖ్య జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ర్యాకం అంజవ్వ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ.. మహిళలు జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవడానికి బాహ్యప్రపంచంలో జరుగుతున్న అనేక విషయాలపై అవ గాహన పెంచుకోవాలన్నారు. ఎన్‌ఎఫ్‌ఐ డబ్ల్యూ రాష్ట్రప్రధానకార్యదర్శి నేదు నూరి జ్యోతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం మహిళాభ్యున్నతికి కృషిచేయడం లేదన్నారు. సమావేశంలో జిల్లాకార్యదర్శి పొనగంటి కేదారి, గూడెం లక్ష్మి, కిన్నెర మల్లవ్వ, నాగేళ్లి వకుళ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-06T05:44:02+05:30 IST