బియ్యం కథ కంచికేనా..?

ABN , First Publish Date - 2020-09-25T05:57:02+05:30 IST

జిల్లాలో గోదాముల్లో నిల్వచేసిన బియ్యాన్ని కాపాడాల్సిన అధికారులే పక్కదారి పట్టించిన వ్యవహారం కొలిక్కిరావడం లేదు. జగిత్యాలలోని చల్‌గల్‌లో ఉన్న ఎఫ్‌సీఐ

బియ్యం కథ కంచికేనా..?

కొలిక్కిరాని బియ్యం తరలింపు వ్యవహారం 

విచారణ పేరిట కాలయాపన 

నేటికీ జాడలేని శాఖపరమైన చర్యలు 

కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు

సంబంధంలేని వ్యక్తులపై ఫిర్యాదు చేయడంతో విచారణలో జాప్యం


(ఆంధ్రజ్యోతి, జగిత్యాల)

జిల్లాలో గోదాముల్లో నిల్వచేసిన బియ్యాన్ని కాపాడాల్సిన అధికారులే పక్కదారి పట్టించిన వ్యవహారం కొలిక్కిరావడం లేదు. జగిత్యాలలోని చల్‌గల్‌లో ఉన్న ఎఫ్‌సీఐ గోదాం నుంచి అక్రమంగా ఈ నెల 12న 80 క్వింటాళ్ల బియ్యం తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే ఘటన జరిగి 12 రోజులు అవుతున్నా ఇప్నటి వరకు ఎ లాంటి చర్యలు తీసుకోలేదు. విచారణ పేరిట అధికారులు కాలయాప న చేయడం చూస్తుంటే అక్రమ బియ్యం తరలింపు వ్యవహారం కథ కంచికి చేరిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని రైస్‌మిల్‌ య జమానులకు సీఎంఆర్‌ కింద ఇచ్చిన వరిధాన్యాన్ని ప్రభుత్వ బియ్యం రూపంలో తిరిగి తీసుకుంటుంది. జిల్లాలో రైస్‌ మిల్లులకు ఇచ్చిన బా యిల్డ్‌ రైస్‌ జగిత్యాల పట్టణ సమీపంలోని చల్‌గల్‌లో ఉన్న ఎఫ్‌సీఐ గో దాంలో నిల్వ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ బియ్యాన్ని తరలించాల్సి ఉండగా ఎఫ్‌సీఐలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు పథకం ప్ర కారం 80క్వింటాళ్ల బాయిల్డ్‌ బియ్యాన్ని మెట్‌పెల్లిలోని ఓ రైస్‌మిల్‌కు అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడింది. ఈ నెల 12న ఘటన జరిగినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 


ఉన్నతాధికారుల ప్రమేయంతోనే విచారణలో జాప్యమా..?

ఒకవైపు పోలీసులు, మరోవైపు ఎఫ్‌సీఐ అధికారులు, ఇంకోవైపు విజిలెన్స్‌ ఎన్‌పోర్స్‌మెంట్‌ అధికారులు విచారణ పేరిట హడావిడి చేశారు. సంబంధిత శాఖ అధికారులు ఇప్పటివరకు ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యవహారం తేలకముందే జగిత్యాలలోని గోదాంలో 400 క్వింటాళ్ల బియ్యం అదనంగా ఉన్నట్లు తేలింది. ఈ రెండు వ్యవహారాలపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా స్థానిక అధికారులు మాత్రం ఉన్నతాధికారులకు నివేదించామని పేర్కొనడం అనుమానాలకు తావిస్తోంది. ఉన్నతాధికారుల ప్రమేయం ఉండడంతోనే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. కోరుట్ల రోడ్డు ప్రమాదం తో వ్యవహారం బయటపడగా అధికారులు ఎవరికి వారే కేసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరొపణలు వెల్లువెత్తుతున్నాయి.


ఆ కేసులో ఎఫ్‌సీఐ అధికారు లు గోదాంలో పనిచేసే అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది (జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌)పై ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు వా రిపై ఎలాంటి చర్యలు లేకపోగా మెట్‌పెల్లిలో ఏ రైస్‌మిల్లుకు తరలిస్తున్నారనే విషయం కూడా తేల్చలేకపోతున్నారు. నిజానికి గోదాం నుంచి బియ్యం తీయాలన్నా, బియ్యాన్ని గోదాముల్లో నిల్వచేయాలన్నా పూర్తి బాధ్యతలు గోదాం ఇన్‌ఛార్జ్‌కు మాత్రమే ఉంటాయి. వారిపై పోలీస్‌ స్టేషన్‌లో ఎలాంటి ఫిర్యాదు చేయకుండా ఎలాంటి సంబంధంలేని అ వుట్‌ సోర్సింగ్‌ సబ్బందిపై ఫిర్యాదు చేయడంతో కేసు కొలిక్కి రాకపోగా పోలీసులు కూడా కేసు విచారణలో ముందడుగు వేయలేకపోతున్నారు.


దీనిపై కోరుట్ల సీఐ రాజశేఖర్‌ రాజును ఆంధ్రజ్యోతి వివరణ కోరగా ఎఫ్‌సీఐ గోదాం అధికారులు ఫిర్యాదును సక్రమంగా చేయలేదని, అం దుకే కేసు విచారణలో జాప్యం జరుగుతుందని అన్నారు. గోదాంలో ఎ లాంటి సంబంధం లేని వ్యక్తులపై ఫిర్యాదు చేయడంతో ముందుకు వెళ్లలేకపోతున్నామని, గోదాంలో పూర్తిబాధ్యతలు  నిర్వహించే వ్యక్తులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని కోరామని, ఆ వివరాలు రాగానే విచారణ వేగవంతం చేస్తామని అన్నారు. ఇదిలా ఉండగా ఎఫ్‌ సీఐ అధికారి దేవేంధర్‌ను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా బియ్యం అక్ర మంగా తరలింపు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఉన్నతాధికారుకు నివేదించామని పేర్కొన్నారు. చర్యలు తీసుకోవాల్సింది ఉన్నతాధికారులేనని ఆయన స్పష్టంచేశారు.  

Updated Date - 2020-09-25T05:57:02+05:30 IST