పాత నేరస్థుడిపై పీడీ యాక్టు

ABN , First Publish Date - 2020-03-13T12:18:21+05:30 IST

సింగరేణికి సంబంధించిన బొగ్గును తరుచూ చోరీ చేయడంతోపాటు ఇతర దొంగ తనాలకు పాల్పడుతున్న వకులాపురం వేణుగోపాల్‌ (31) అనే పాత నేరస్థుడిపై గురువారం రామగుండం సీపీ వి. సత్యనారాయణ పీడీ యాక్టును నమోదు చేశారు.

పాత నేరస్థుడిపై పీడీ యాక్టు

వరంగల్‌ జైలుకు  తరలింపు


జ్యోతినగర్‌, మార్చి 12: సింగరేణికి సంబంధించిన బొగ్గును తరుచూ చోరీ చేయడంతోపాటు ఇతర దొంగ తనాలకు పాల్పడుతున్న వకులాపురం వేణుగోపాల్‌ (31) అనే పాత నేరస్థుడిపై గురువారం రామగుండం సీపీ వి. సత్యనారాయణ పీడీ యాక్టును నమోదు చేశారు. ఎన్టీపీసీ పోలీస్‌ స్టేషన్లో రామగుండం సీఐ కరుణాకర్‌రావు, ఎన్టీపీసీ ఎస్‌ఐ ఉమాసాగర్‌ నింది తుడు వేణుగోపాల్‌కు పీడీ యాక్టు ఉత్తర్వుల పత్రాన్ని అందజేశారు. అనంతరం అతడిని వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. సీపీ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఎన్టీపీసీ పోలీ స్‌ స్టేషన్‌ పరిధిలోని ఎల్కలపల్లి గేట్‌కు చెందిన వకులాపురం వేణుగోపాల్‌ సులువుగా డబ్బు సంపా దించాలనే ఉద్దేశంతో చోరీలకు పాల్పడుతున్నాడు. ప్రధానంగా సింగరేణి సీఎస్‌పీల నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా ఎన్టీపీసీకి తరలిస్తున్న బొగ్గును తరుచుగా చోరీ చేస్తున్నాడు. అలాగే ఇతర చోరీలకు పాల్పడుతు న్నాడు. 2019,20లలో 4 చోరీ కేసులు, 2010 నుంచి 2019 వరకు 12 కేసులలో నిందితుడిగా ఉన్నాడు.


బొగ్గును చోరీ చేయడం వల్ల సింగరేణి సంస్థకు లక్ష లాది రూపాయల ఆర్థిక నష్టం కల్గించ డంతోపాటు ఎన్టీపీసీకి బొగ్గు కొరతకు కారకుడయ్యాడు. వేణు గోపాల్‌ నేరాలకు పాల్ప డడం వల్ల సింగరేణికి నష్టం కల్గించడంతోపాటు సామాన్యులు భయాందోళనలకు గురయ్యారు. శాంతి భద్ర తలకు విఘాతం కల్గిస్తున్న వేణుగోపాల్‌పై పీడీ యాక్టు నిర్బంధ ఉత్తర్వులు ఇచ్చినట్లు ప్రకట నలో పేర్కొన్నారు. రామగుండం కమిషరేట్‌ పరి ధిలో సంఘ విద్రోహ చర్యలు, నేర సంఘటన లు, ప్రజల స్వేచ్ఛకు భంగం కల్గించడం, భూ కబ్జా తదితర నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్టు అమలు చేస్తామని సీపీ హెచ్చరించారు. కాగా, తరుచూ చోరీలకు పాల్పడుతున్న వేణుగో పాల్‌పై పీడీ యాక్టు అమలు చేయడంలో సమర్థవం తంగా పని చేసిన రామగుండం సీఐ కరుణాకర్‌రావు, ఎస్‌ఐ ఉమా సాగర్‌ను సీపీ సత్యనారాయణ అభినందించారు. 

Updated Date - 2020-03-13T12:18:21+05:30 IST