-
-
Home » Telangana » Karimnagar » The 42nd death anniversary of Baddam Ellareddy
-
బద్దం ఎల్లారెడ్డి ఆశయసాధన కోసం పాటుపడాలి
ABN , First Publish Date - 2020-12-28T04:19:36+05:30 IST
బద్ధం ఎల్లారెడ్డి ఆశయాల సాధన కోసం ప్రతి సీపీఐ కార్యకర్త కృషిచేయాలని రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
భగత్‌నగర్, డిసెంబరు 27: బద్ధం ఎల్లారెడ్డి ఆశయాల సాధన కోసం ప్రతి సీపీఐ కార్యకర్త కృషిచేయాలని రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బద్దం ఎల్లారెడ్డి 42వ వర్ధంతిని పురస్క రించుకుని ఆదివారం కోతిరాంపూర్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాకే రాజకీయ పితామహుడుగా పేరుపొందిన బద్దం ఎల్లారెడ్డి ఆందరికీ ఆదర్శప్రాయుడన్నారు. జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి, కొయ్యడ సృజన్‌కుమార్, టేకుమల్ల సమ్మయ్య పాల్గొన్నారు.