ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి
ABN , First Publish Date - 2020-12-01T06:07:53+05:30 IST
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను వెంటనే చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బి.నరసింహారావు డిమాండ్ చేశారు.

టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నరిసింహారావు
పెద్దపల్లి కల్చరల్, నవంబరు 30: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను వెంటనే చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బి.నరసింహారావు డిమాండ్ చేశారు. పెద్దపల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో సోమవారం జరిగిన టీఎస్‌యూటీఎఫ్ పెద్దపల్లి జిల్లా తృతీయ మహాసభ జిల్లా అధ్యక్షుడు డా. టి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ మహసభలకు ముఖ్య అతిఽథిగా రాష్ట్ర కార్యదర్శి నర్సింహారావు హాజరై మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం యూఎస్పీసీ, జాక్టోల ఆధ్వర్యంలో మూడు దశల పోరాట కార్యక్రమాన్ని రూపొందించామని పేర్కొన్నారు. మొదటి దశ పాఠశాల స్థాయిలో డిసెంబరు 8,9 తేదీల్లో మధ్యాహ్న భోజన విరామంలో నిరసన ప్రదర్శనలు, రెండో దశలో డిసెంబరు 17న జిల్లా స్థాయిలో సామూహిక నిరాహార దీక్షలు, మూడో దశలో డిసెంబరు 29న రాష్ట్ర స్థాయిలో మహాధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శులు అశోక్, శాంతకుమారిలు మాట్లాడుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించి వెంటనే ప్రభుత్వం రైతు సంఘాలతో చర్చలు జరిపి సమస్య పరిష్కారం కోసం పాటుపడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, మండల బాధ్యులు పాల్గొన్నారు.