ప్రమాద నివారణ యాజమాన్యం చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2020-11-27T05:02:05+05:30 IST

కాలనీ, గోదావరిఖని మధ్య ఉన్న కోల్‌కారి డార్‌ రోడ్డుపై ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ గురువా రం అఖిలపక్షం నాయకులు పోతనకాలనీ వద్ద రాస్తారోకో నిర్వహించారు.

ప్రమాద నివారణ యాజమాన్యం చర్యలు చేపట్టాలి
రహదారిపై నాయకుల నిరసన

- అఖిలపక్షం రాస్తారోకో

యైటింక్లయిన్‌కాలనీ, నవంబరు 26: కాలనీ, గోదావరిఖని మధ్య ఉన్న కోల్‌కారి డార్‌ రోడ్డుపై ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ గురువా రం అఖిలపక్షం నాయకులు పోతనకాలనీ వద్ద రాస్తారోకో నిర్వహించారు. సుమా రు అరగంటసేపు రాస్తారోకో చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి. ఓసీపీ-1 నుంచి ఓసీపీ-3 సీహెచ్‌పీల మధ్య రోడ్డుకు ఇరువైపులా చెట్లపొదలు పెరిగి ప్ర మాదాలకు కారణం అవుతున్నట్టు జేఏసీ నాయకులు పేర్కొన్నారు. రద్దీగా ఉండే రోడ్డుపై సరైన లైటింగ్‌ లేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్టు తెలిపారు. సిం గరేణి యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో నాయకులు రాస్తారోకోను విరమించారు. నిరసన లో బీజేపీ, కాంగ్రెస్‌, ఏఐటీయూసీ, ఇఫ్టూ, సీఐటీయూ, ఎంఆర్‌పీఎస్‌ల నాయకు లు మూకిరి రాజు, గుండేటి రాజేష్‌ సొప్పదండి దుర్గాప్రసాద్‌, రాజారత్నం, ప్రకా ష్‌, ఉల్లి మొగిలి, పొట్ల వెంకటి, మహేష్‌, అవినాష్‌, శంకర్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-27T05:02:05+05:30 IST