నిర్బంధం..తప్పదు
ABN , First Publish Date - 2020-04-21T10:07:52+05:30 IST
కంటికి కనిపించని శత్రువు తో నిశ్శబ్ద ఉద్యమం సాగుతోంది. కరోనా కట్టడికి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు గడపదాటకుండా

లాక్‌డౌన్ పొడిగింపుతో నిట్టూర్పు
మరో 16 రోజులు నిరీక్షణే
స్వల్ప ఉల్లంఘనలు.. కలిసికట్టుగా జనం
వేములవాడ కట్టడిప్రాంతంలో నిఘా
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల): కంటికి కనిపించని శత్రువు తో నిశ్శబ్ద ఉద్యమం సాగుతోంది. కరోనా కట్టడికి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు గడపదాటకుండా పోరా డుతున్నారు. స్వల్ప ఉల్లంఘనలు మినహా లాక్‌డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మే 7 వరకు పొడిగించడంతో ప్రజల్లో కొంత నిట్టూర్పు కనిపిస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌనే మార్గం కావడంతో మరో 16 రోజులు ఇళ్లలోనే నిరీక్షించక తప్పదని భావిస్తు న్నారు. మరోవైపు జిల్లాలోని పరిస్థితులను కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్‌హెగ్డే నిరంతరం పర్య వేక్షిస్తున్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందిస్తున్నారు.
వేములవాడలో కట్టడిప్రాంతం కట్టుదిట్టం
వేములవాడలోని సుభాష్‌నగర్ ప్రాంతంలో హోం క్వారంటైన్‌ను కట్టుదిట్టంగా కొనసాగిస్తున్నా రు. ఇంటింటి సర్వేతోపాటు వైద్య పరీక్షలు నిర్వహి స్తున్నారు. ఇళ్లకు వెళ్లి నిత్యావసరాలు అందజేస్తు న్నారు. పాజిటివ్ వచ్చిన వారితో కాంటాక్ట్ అయిన వ్యక్తుల నమూనాలను పరీక్షలకు పం పించారు. జిల్లాలో ఇప్పటి వరకు 106 మంది నమూనాలు సేకరించారు. 98 మందికి నెగెటివ్, ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. ఐదుగురి రిపోర్టులు రావాల్సి ఉంది.
ఐసోలేషన్ నుంచి పరారు..జియో ట్యాగింగ్‌తో పట్టివేత
సిరిసిల్ల ఆస్పత్రిలోని ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తి పరారవడం కలకలం రేపింది. వేములవాడలో పాజి టివ్ వచ్చినవారితో సంబంధం ఉన్న వ్యక్తులను హోంక్వారంటైన్ చేశారు. ఐదుగురిని జిల్లా ఆస్పత్రిలోని ఐసోలేషన్‌కు తరలించారు.ఈ క్రమం లోనే జియో ట్యాగింగ్ చేశారు. ఐసోలేషన్‌లో 14 రోజుల వరకు ఉండాల్సి వస్తుందని ఓ వ్యక్తి ఆస్పత్రి నుంచి తప్పించుకెళ్లాడు. హైరానా పడిన ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. జియో ట్యాగింగ్ ద్వారా పట్టుకొని ఆస్పత్రికి తరలించారు.