-
-
Home » Telangana » Karimnagar » Support price should be paid for fine grain
-
సన్నరకం ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలి
ABN , First Publish Date - 2020-11-25T05:39:39+05:30 IST
రైతులు అరుగాలం కష్టించి పండించిన సన్నరకం ధాన్యానికి రూ. 2,500ల మద్దతు ధర చెల్లించాలని మంగళవారం సిరిసిల్ల కలెక్ట రేట్ ఎదుట సీపీఐ నాయ కులు ధర్నా నిర్వహించారు.

కలెక్టరేట్ ఎదుట సీపీఐ ధర్నా
సిరిసిల్ల కలెక్టరేట్, నవంబరు 24: రైతులు అరుగాలం కష్టించి పండించిన సన్నరకం ధాన్యానికి రూ. 2,500ల మద్దతు ధర చెల్లించాలని మంగళవారం సిరిసిల్ల కలెక్ట రేట్ ఎదుట సీపీఐ నాయ కులు ధర్నా నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలోని కార్మిక భవనం నుంచి రైతులతో కలిసి నాయకులు ఎర్ర జెండాలతోపాటు ఫ్లకార్డులను ప ట్టుకొని ర్యాలీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు మాట్లాడుతూ ముఖ్యమం త్రి కేసీఅర్ పిలుపుమేరకు రైతాంగం సన్నరకం ధాన్యా న్ని పండించారన్నారు. ఎకరానికి దోడ్డు రకం 35 క్వింటా ళ్లు వస్తుండగా సన్నరకం ఎకరానికి 12 క్వింటాళ్లకు మిం చి రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. జిల్లాలో 58వేల మంది రైతులు సన్నరకం ఽధాన్యాన్ని సాగు చేయగా దోమపోటు, కల్తీవిత్తనాలు, క్రిమిసంహా రక మందులతో నష్టపోయారని అవేదన వ్యక్తం చేశా రు. పండించిన సన్నరకం ధాన్యాన్ని విక్రయించేందు కు కొనుగోలు కేంద్రాలలో ఆరబెట్టి 20 రోజులు గడుస్తు న్నా కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అకాల వర్షాలతోపాటు దోమపోటు తో కాల్చివేసిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహా రం అందించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ బిల్లు లను రద్దు చేయాలంటూ కలెక్టరేట్ ఏవో గంగయ్యకు వి నతి పత్రం అందించారు. నాయకులు సామల మల్లే శం, బూర శ్రీనివాస్, కడారి రాములు, పోలు కొము రయ్య, ఎలిగేటి రాజశేఖర్, మంత్రి చందన్న, భూంపెల్లి భూంరెడ్డి, బచ్చుపల్లి శంకర్, అజ్జవేణు, జంగపల్లి లచ్చయ్య పాల్గొన్నారు.