జగిత్యాలలో దంపతుల ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-11-13T10:13:18+05:30 IST

జగిత్యాల జిల్లా కేంద్రంలోని శివ వీధిలో గురువారం రాత్రి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జగిత్యాల పట్టణంలోని శివవీధికి చెందిన గంజి రాంబాబు(49), లావణ్య(47) అనే దంపతులు ముంబాయిలో ఓయాడ్‌ ఏజెన్సీలో

జగిత్యాలలో దంపతుల ఆత్మహత్య

జగిత్యాల టౌన్‌, నవంబరు 12: జగిత్యాల జిల్లా కేంద్రంలోని శివ వీధిలో గురువారం రాత్రి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జగిత్యాల పట్టణంలోని శివవీధికి చెందిన గంజి రాంబాబు(49), లావణ్య(47) అనే దంపతులు ముంబాయిలో ఓయాడ్‌ ఏజెన్సీలో పని చేస్తున్నారు. అయితే రాంబాబు తండ్రి రాజేశం ఎనిమిది నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి రాంబాబు దంప తులు జగిత్యాలకు వచ్చి ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం దంపతులకు కరోనా పాసిటివ్‌ వచ్చింది. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నారు. 20 రోజుల క్రితం రాంబాబు సోదరి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.  వీరు గురువారం తమ ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం రాత్రి రాంబాబు స్నేహితులు అతనికి  ఫోన్‌ చేసినా స్పందించక పోవడంతో ఇంటికి వచ్చి చూసే వరకు దంపతులు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు.  వీరికి వివాహమై 25 ఏళ్లు గడుస్తున్నా సంతానం లేదు. ఏ కారణాల వల్ల దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్న విషయం తేలాల్సి ఉంది.  జగిత్యాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-11-13T10:13:18+05:30 IST