ప్రభుత్వ ముందుచూపుతో గణనీయమైన దిగుబడి

ABN , First Publish Date - 2020-12-19T05:37:23+05:30 IST

ప్రభుత్వ మందుచూపుతో రైతులు గణనీయమైన దిగుబడి సాధిస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, జడ్పీచైర్‌పర్సన్‌ దావ వసంత అన్నారు.

ప్రభుత్వ ముందుచూపుతో గణనీయమైన దిగుబడి
రైతులు సాగు చేసిన కందిపంటను పరీశీలిస్తున్న ఎమ్మెల్యే,జడ్పీచైర్‌ పర్సన్‌

ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత

జగిత్యాల రూరల్‌, డిసెంబరు 18 : ప్రభుత్వ మందుచూపుతో రైతులు గణనీయమైన దిగుబడి సాధిస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, జడ్పీచైర్‌పర్సన్‌ దావ వసంత అన్నారు. జగిత్యాల రూరల్‌ మండలంలోని పొరండ్ల గ్రామంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ ఆహార భద్రత పధకం మిషన్‌ కార్యక్రమంలో భాగంగా కందిరైతులకు 100 శాతం సబ్సిడీపై పురుగుల మందుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మె ల్యే, జడ్పీచైర్‌ పర్సన్‌లు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక ప్పుడు అంతర పంటగా ఉండే పప్పుదినుసులు, కందిపంటను నేడు కాలనుగుణంగా ఎకరాల కొద్ది సాగు చేస్తున్నామన్నారు. రైతులు,రై తు కూలీలు ప్రతి ఒక్కరు ఆర్థికంగా బలపడాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ రైతాంగం సంక్షేమం కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అ న్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలను దేశవ్యాప్తం గా అనుసరిస్తురన్నారని తెలిపారు. సీఎం ప్రభుత్వ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు. జడ్పీ చైర్‌ పర్సన్‌ దావ వ సంత మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తున్నారన్నారు. అనంతరం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న టీఆర్‌నగర్‌ మాజీ సర్పంచ్‌ కుమారుడు హరేంద్రను ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ కార్యక్రమంలోజిల్లా వ్య వసాయశాఖ అధికారి పాక సురేష్‌, ఎంపీపీ గంగారాంగౌడ్‌, ప్యాక్స్‌ చైర్మ న్లు సందీప్‌రావు, మహిపాల్‌రెడ్డి, రైతు బంధు మండల కన్వీనర్‌ రవీందర్‌రెడ్డి, ఆత్మ చైర్మన్‌రాజిరెడ్డి, రూరల్‌ ఏవో తిరుపతినాయక్‌, సర్పంచ్‌ సం ద్యారాణి, నాయకులు గంగారెడ్డి, రాజన్న, రవి పాల్గొన్నారు.

Read more