బండి సంజయ్‌ని విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

ABN , First Publish Date - 2020-05-11T10:27:17+05:30 IST

రైతుల సమస్యలపై పోరాటంచేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌పై నగర మేయర్‌ సునీల్‌రావు తన స్థాయికి మించిన విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ కార్పొరేటర్లు అన్నారు.

బండి సంజయ్‌ని విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

సుభాష్‌నగర్‌, మే 10: రైతుల సమస్యలపై పోరాటంచేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌పై నగర మేయర్‌ సునీల్‌రావు తన స్థాయికి మించిన విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ కార్పొరేటర్లు అన్నారు. ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.


రైతుల సమస్యలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని టీఆర్‌ఎస్‌ నేతలు ప్రతి విమర్శలుచేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న ఎంపీపై మేయర్‌ అవాకులు, చవాకులు పేలడం విడ్డూరంగా ఉందన్నారు. ఎంపీ సంజయ్‌పై అనవసర విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్పొరేటర్లు రాపర్తి విజయ, గుగ్గిల్ల జయశ్రీ, చొప్పరి జయశ్రీ, పెద్దపల్లి జితేందర్‌, మర్రి భావన, బండి సుమ, రాజేశ్వరి, కచ్చు రవి, కొలగాని శ్రీనివాస్‌, మెండి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-05-11T10:27:17+05:30 IST