నిందితుడిని కఠినంగా శిక్షించాలి

ABN , First Publish Date - 2020-02-12T11:52:42+05:30 IST

రాధికను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ చౌక్‌లో నిరసన వ్యక్తం చేశారు.

నిందితుడిని కఠినంగా శిక్షించాలి

 వామపక్ష విద్యార్థి సంఘాల నాయకుల నిరసన


గణేశ్‌నగర్‌, ఫిబ్రవరి 11: రాధికను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ చౌక్‌లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐ ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి భువనగిరి మహేందర్‌ మాట్లాడుతూ దేశంలో రోజు రోజుకు మహిళలపై అత్యాచారాలు పెరుగు తున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా చట్టాలు అమలు చేయలేక పోతున్నాయన్నారు. కరీంనగర్‌ పట్టణంలో రాధిక హత్యచేసి పరారైన నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలన్నారు.


దేశంలో అమ్మాయిలకు రక్షణ కల్పించాలన్నారు. ఈ మానవహారం మద్దతుగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బండారి శేఖర్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శనిగరపు రజనికాంత్‌, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు రత్నం రమేశ్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి తిరుపతి, ఎఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి యుగేందర్‌, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రమేశ్‌, ఎఐఎస్‌బి జిల్లా ఉపాధ్యక్షుడు రోహిత్‌రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహయకార్యదర్శి పోచంపల్లి రాకేశ్‌, గజ్జల శ్రీకాంత్‌, కాంపెల్లి అరవింద్‌, రాష్ట్ర గర్ల్స్‌ కోకన్వీనర్‌ పూజ, జిల్లా కమిటీ సభ్యులు అవినాష్‌, ఎఐఎస్‌ఎఫ్‌ నగర అధ్యక్షుడు నునావత్‌ శ్రీనివాస్‌, సందీప్‌రెడ్డి పాల్గొన్నారు.


 హత్యకు గురైన రాధిక కుటుంబానికి న్యాయం జరగాలని నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ దేశంలో యువ తులు, మహిళలపై దాడులు అధికంగా జరుగుతున్నాయన్నారు. యువతుల రక్షణకు ఎన్ని చట్టాలు అమలు చేసినా దాడులు ఆగడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు సంగీత, సాహిత్య, వెన్నెల, కావ్య, సృతి, శైలజ, రమ్య, నిరోష, రమ్య, కల్యాణి, శిల్పణి, కావ్య, శారద, శీరిష, రుక్మిణి, దివ్య, ఇందు, తేజస్విని, శ్రీవిద్య, మానస, సాయిపవన్‌, రాజు, అరుణ్‌, మహిపాల్‌, చంద్ర, ప్రవీన్‌, ప్రేమ్‌, అశోక్‌, భరత్‌, సతీష్‌, అనిల్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-12T11:52:42+05:30 IST