సమ్మె సక్సెస్‌

ABN , First Publish Date - 2020-11-27T05:03:10+05:30 IST

కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా గురువారం చేపట్టిన దేశవ్యాప్త సమ్మె జిల్లాలో విజయ వంతంగా ముగిసింది.

సమ్మె సక్సెస్‌
సిరిసిల్ల కలెక్టరేట్‌ ఎదుట కార్మికుల ధర్నా

- కదంతొక్కిన కార్మికులు, ఉద్యోగులు 

-  కలెక్టరేట్‌, తహసీల్‌ కార్యాలయాల ఎదుట ధర్నా 

- జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె ఆందోళనలు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా గురువారం చేపట్టిన దేశవ్యాప్త సమ్మె జిల్లాలో విజయ వంతంగా ముగిసింది. నిరసనలు, ఆందోళనలతో కార్మికులు, ఉద్యోగులు కదంతొక్కారు. ఏఐటీయూసీ, సీఐటీ యూ, ఐఎఫ్‌టీయూ, టీఎన్‌టీయూసీ, టీఆర్‌ఎస్‌కేవీ, ఐఎన్‌టీయూసీ, కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేర కు జిల్లా వ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో సీఐటీయూ, ఏఐటీయూసీ ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వ హించారు.  కలెక్టరేట్‌  ఎదుట ధర్నా చేపట్టారు.  కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నినా దాలు చేశారు. అదనపు కలెక్టర్‌ అంజయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామల మల్లేశం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ కంపెనీలకు రాయితీలు ఇస్తోందని, కార్మికుల హక్కులను హరించే విధంగా వ్యవహరి స్తోం దని అన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ మూడు వ్యవ సాయ బిల్లులను అమోదించిందని, నిత్యావసర వస్తు వుల చట్టం రద్దు చేసిందని అన్నారు. జీఎస్టీ విధానం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని, ప్రభుత్వ విధానాలతో రాష్ట్రాలు బలహీన పడుతున్నాయని అన్నారు. సీఐటీ యూ రాష్ట్ర కమిటీ సభ్యుడు కరపాటి రమేష్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆర్‌బీఐ, ఎల్‌ఐసీ, ప్రభు త్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు మొగ్గు చూపుతోందని అన్నారు. మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయడంతో పాటు రూ.21 వేల వేతనం ఇవ్వాలని, ఆదాయం పన్ను చెల్లింపు పరిధిలోనికి రాని వారి బ్యాంకు ఖాతాలకు ప్రతీ నెల రూ.7,500 బదిలీ చేయాలని అన్నారు. ఉపాధి హామీ  పథకంలో వేతనం పెంచుతూ 200 పనిదినాలు కల్పించాలన్నారు. అసంఘంటిత కార్మికులకు  రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సిరిసిల్లలో పవ ర్‌లూం కార్మికులు, బీడీ కార్మికులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టించాలని అన్నారు. పవర్‌లం కార్మికులు, అను బంధ కార్మికులకు కనీస వేతనంగా రూ.25 వేలు ఇచ్చే విధంగా యజమానులతో ఒప్పందం చేయించాలన్నారు. ఆశావర్కర్లకు కనీస వేనతం రూ.21 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బూర శ్రీనివాస్‌, ఎలిగేటి రాజశేఖర్‌, వేణు, సీఐటీయూ తరఫున సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ, అన్నల్‌దాస్‌ గణేష్‌, ఐఎఫ్‌ టీయూ  జిల్లా ప్రధాన కార్యదర్శి మీస లక్ష్మణ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు కరుణాకరన్‌, టీఎన్‌టీయూసీ తరఫున జిల్లా అధ్యక్షుడు మేర్గు సుదర్శన్‌ మున్సిపల్‌ కార్మిక సంఘం అధ్యక్షుడు సుల్తాన్‌ నర్సయ్య, టీఆర్‌ఎస్‌కేవీ ప్రధాన కార్యదర్శి వెంగళ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-27T05:03:10+05:30 IST