వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2020-12-04T04:33:02+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం ప్రజా సంఘాల నేతలు ఆరోపించారు.

వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలి
నిరసన తెలుపుతున్న ప్రజాసంఘాల నాయకులు

జగిత్యాల అర్బన్‌, డిసెంబరు 03: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం ప్రజా సంఘాల నేతలు ఆరోపించారు. గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలో సీపీఎం ప్రజా సంఘాల కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూతం సారంగపాణి, జిల్లా సీపీఎం ప్రజా సంఘాల కన్వీనర్‌ తిరుపతి నాయక్‌లు మాట్లాడుతూ ఢిల్లీలో గత వారం రోజులుగా శాంతియుతంగా తమ డిమాండ్ల సాధనకు నిరసన తెలుపుతున్న రైతులపై కేంద్ర ప్రభుత్వం లాఠీఛార్జీ చేయడం దారుణం అన్నారు. రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని, మూడు వ్యవసాయ బిల్లులు ఉప సంహరించుకోవాలనే డిమాండ్‌తో రైతులు చేస్తున్న పోరాటానికి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. రైతులపై మోడీ ప్రభుత్వం చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకించి చేతులు దులుపుకోకుండా కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలు, రైతాంగ ఉద్యమాలతో కలిసి రావాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంఘ జిల్లా కార్యదర్శి నాయిని శారద, ఉపాధ్యక్షురాలు సురకాని లక్ష్మీ, సీఐటీయూ జిల్లా కో కన్వీనర్‌ సింధూరి సులోచన, జీపీ కార్మికుల సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు ముడుగం రాజలింగు, ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి అక్రమాలిక్‌ తదితరులున్నారు.  

Updated Date - 2020-12-04T04:33:02+05:30 IST