నీటిని తొలగించేందుకు చర్యలు: మేయర్ సునీల్‌రావు
ABN , First Publish Date - 2020-08-12T10:24:19+05:30 IST
నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీటిని తొలగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు మేయర్ వై సునీల్‌రావు అన్నారు.

కరీంనగర్ టౌన్, ఆగస్టు 11: నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీటిని తొలగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు మేయర్ వై సునీల్‌రావు అన్నారు. సోమవారం ఆయన అల్కాపురికాలనీ, అశోక్‌నగర్, బ్యాంకుకాలనీ, తులసీనగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ఇళ్ల మధ్య నిలిచిన వర్షపు నీటిని పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలో ఎక్కడ కూడా వర్షపు నీరు నిలువకుండా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. వచ్చే వర్షా కాలం వరకు అన్ని డివిజన్లలో మురుగునీటి కాలువలను నిర్మిస్తామని చెప్పారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి..
మొక్కలను ప్రతి ఒక్కరూ నాటి వాటిని సంరక్షించాలని మేయర్ వై.సునీల్‌రావు నగర ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణాకు హరితహారం ఆరో విడతలో భాగంగా ఆదర్శనగర్‌లో కార్పొరేటర్ అర్షకిరణ్మయితో కలిసి అభయాంజనే యస్వామి దేవాలయ ప్రాంగణంలో మారేడు మొక్కను నాటారు. అనంతరం కాలనీ ప్రజలకు, దేవాలయ కమిటీ సభ్యులకు ప్రతి ఇంటికి మూడు పూల, మూడు పండ్ల మొక్కలను పంపిణీ చేశారు.