-
-
Home » Telangana » Karimnagar » state government completely ignored the farmers
-
రైతులను పూర్తిగా విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం
ABN , First Publish Date - 2020-12-31T04:55:50+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం రైతుల ను పూర్తిగా విస్మరిస్తోందని మంథని ఎమ్మెల్యే దు ద్దిళ్ళ శ్రీధర్‌బాబు ఆరోపించారు.

- మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు
రామగిరి, డిసెంబర్ 30: రాష్ట్ర ప్రభుత్వం రైతుల ను పూర్తిగా విస్మరిస్తోందని మంథని ఎమ్మెల్యే దు ద్దిళ్ళ శ్రీధర్‌బాబు ఆరోపించారు. బుధవారం మండ లంలోని సెంటినరీకాలనీలోని తహసీల్దార్ కార్యాల యం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్ర భుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తూ ఏకపక్ష నిర్ణయాన్ని తీవ్రం గా ఆక్షేపిస్తూ స్థానిక ఐఎన్‌టీయూసీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీని చే పట్టారు. అనంతరం కార్యాలయంలో ఎదుట ఏర్పా టుచేసిన శిబిరంలో ఆయన మాట్లాడారు. రైతుల ను పూర్తిగా విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం వారిని దళారులకు అప్పగించే ప్రయత్నంలో ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల రద్దును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ పుష్పల తకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో తొట్ల తిరుపతియాదవ్, తొట చంద్రయ్య, చోప్పరి సదానందం, శశిభూషణ్‌కాచే, ఎంపీటీసీలు చిందం మహేష్, కొట్టే సందీప్, గణపతి, వనం రాంచందర్ రావు, బర్ల శ్రీనివాస్, కాటం సత్యం, పబ్బతి రాధ, ముస్త్యాల శ్రీనివాస్, గాండ్ల మోహన్, రఘ, నూనే రాజేషం, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.