భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

ABN , First Publish Date - 2020-03-18T12:17:53+05:30 IST

జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి పరిపాలన పరంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ తెలిపారు. మంథని తహసీల్దార్‌ కార్యాలయంలో డీఆర్‌వో నర్సింహమూర్తి, తహసీల్దార్‌ అనుపమరావు, రెవెన్యూ

భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ 

మంథని, మార్చి 17: జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి పరిపాలన పరంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ తెలిపారు. మంథని తహసీల్దార్‌ కార్యాలయంలో డీఆర్‌వో నర్సింహమూర్తి, తహసీల్దార్‌ అనుపమరావు, రెవెన్యూ ఉద్యోగులతో భూ సమస్యల పరిష్కా రంపై మంగళవారం ఆదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా ఏళ్లుగా భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులంతా గ్రామాల వారిగా జరుగుతున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.


సమస్యల అధికారుల దృష్టికి తీసుకు వస్తే వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకొని అర్హులైన వారందరికీ తగిన విధంగా న్యాయం చేస్తామన్నారు. రెవెన్యూ ఉద్యోగులు సైతం రైతుల సమస్యల పరిష్కారం కోసం వెనువెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యలను పెండింగ్‌లో పెట్టి మిగతా వాటిని గ్రామ రెవెన్యూ సదస్సులో పరిష్కారం కోసం చొరవ చూపాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో కరోనా వ్యాధిని కట్టడి చేయడానికి ముందస్తు నియంత్రణ చర్యలను చేపడుతున్నట్లు తెలిపారు.


ఇందు కోసం తహసీల్దార్‌, ఎంపీడీవో, మెడికల్‌ ఆఫీసర్‌లతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి వ్యాధి ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేస్తామన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందవల్సిన అవసరం లేదన్నారు. బహిరంగ సభలు, సమావేశాలను నిర్వహించకూడదని, రద్దీగా ఉండే ప్రాంతాలకు ప్రజలు వెళ్లకూడదని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-03-18T12:17:53+05:30 IST