నిర్వాసితుల సమస్యలకు పరిష్కారం

ABN , First Publish Date - 2020-12-29T05:48:55+05:30 IST

మిడ్‌ మానేరు ముంపు గ్రామాల సమస్యల కు పరిష్కారం లభించిందని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌తో ముంపు గ్రామాల పెండింగ్‌ సమస్యలపై సమావేశ మయ్యారు.

నిర్వాసితుల సమస్యలకు పరిష్కారం
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌తో సమావేశమైన జడ్పీ చైర్‌పర్సన్‌, నాయకులు

సిరిసిల్ల, డిసెంబరు 28 (ఆంరఽధజ్యోతి): మిడ్‌ మానేరు ముంపు గ్రామాల సమస్యల కు పరిష్కారం లభించిందని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌తో ముంపు గ్రామాల పెండింగ్‌ సమస్యలపై సమావేశమయ్యారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్లు, భూముల పరిహారం ఇవ్వను న్నట్లు, 18 సంవత్సరాలు నిండిన యువతకు, నిరక్షరాస్యులకు పరిహారం అందజేయనున్నట్లు చెప్పారు. వేములవాడ జడ్పీటీసీ  రవి, కోనరావుపేట టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రాఘవరెడ్డి, వేములవాడ మండల పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ ఆర్‌సీరావు, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ ప్రవీణ్‌, సర్పంచ్‌ రామిరెడ్డి, కొలనూర్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ రామ్మోహన్‌రావు, రాణి హరిచరణ్‌రావు పాల్గొన్నారు. 


ఎగ్లాస్‌పూర్‌ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి ఎర్రబెల్లి హామీ

కోనరావుపేట మండలం ఎగ్లాస్‌పూర్‌ బ్రిడ్జి నిర్మాణానికి రూ.84 లక్షలు పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని జడ్పీ చైర్‌ పర్సన్‌  న్యాలకొండ అరుణ హైదరాబాద్‌లో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిసి విన్నవించారు. స్పందించిన మంత్రి త్వరలోనే బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కొత్తగా గ్రామ పంచాయతీలకు, శిథిలావస్థలో ఉన్న జీపీ భవనాలకు నిధులు కేటాయించాలని చైర్‌పర్సన్‌ కోరారు. 


Updated Date - 2020-12-29T05:48:55+05:30 IST