నాబార్డు చైర్మన్‌కు ఘన స్వాగతం

ABN , First Publish Date - 2020-12-20T05:46:30+05:30 IST

గంభీరావుపేట మండలానికి శనివా రం పలు కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వచ్చిన నాబార్డు చైర్మన్‌ గోవిందరాజులు చింతలకు ఘన స్వాగతం పలికారు. దమ్మన్నపేటలో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణ, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు స్వాగతం పలికారు.

నాబార్డు చైర్మన్‌కు ఘన స్వాగతం
గోవింరాజులుకు స్వాగతం పలుకుతున్న అధికారులు

గంభీరావుపేట, డిసెంబరు19 : గంభీరావుపేట మండలానికి శనివా రం పలు కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వచ్చిన  నాబార్డు చైర్మన్‌ గోవిందరాజులు చింతలకు ఘన స్వాగతం పలికారు. దమ్మన్నపేటలో  కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణ,  టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు స్వాగతం పలికారు.   వేములవాడ  ఎమ్మెల్యే రమేష్‌బాబు రాసిన సుస్థిర వ్యవసాయంపై వ్యాసాల బుక్‌ను నాబార్డు చైర్మన్‌కు అందజేశారు.  టీఆర్‌ఎస్‌ జిల్లా ఇన్‌చార్జి తోట ఆగయ్య, నాయకులు గోపాల్‌రావు, టీఆర్‌ఎస్‌ మండల  అధ్యక్షుడు వెంకటస్వామి పాల్గొన్నారు. 


బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 

గంభీరావుపేట మండల కేంద్రంలో శనివారం బీజేపీ నాయకులను పోలీస్‌లు అదుపులోకి తీసుకున్నారు. మండల కేంద్రంలో నాబార్డు చైర్మన్‌ కార్యక్రమానికి ఎంపీ బండి సంజయ్‌ను ఆహ్వానించలేదని  ఆందోళన చేపట్టారు.  సభ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీస్‌లు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు అశోక్‌, ఎంపీటీసీ రాజేందర్‌, నాయకులు ప్రసాద్‌, కృష్ణ, పర్శాగౌడ్‌, రాజ్‌కుమార్‌, రమేష్‌, నరేష్‌చారి, రామచంద్రం ఉన్నారు. 


 సభను బహిష్కరించిన సర్పంచ్‌ 

 బీజేపీ నాయకుల  అరెస్టును నిరసిస్తూ  నాబార్డు చైర్మన్‌ సభను గంభీరావుపేట సర్పంచ్‌ కటకం శ్రీధర్‌పంతులు బహిష్కరించారు.   ఎంపీ బండి సంజయ్‌ను ఆహ్వానించక పోవడం దారుణమని, ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు. 

Updated Date - 2020-12-20T05:46:30+05:30 IST