-
-
Home » Telangana » Karimnagar » Soil conservation with pollution prevention
-
కాలుష్య నివారణతోనే నేల పరిరక్షణ
ABN , First Publish Date - 2020-12-06T06:06:47+05:30 IST
కాలుష్య నివారణతోనే నేలలు పరిరక్షించబడుతాయని రామగుండం నగర మేయర్ బంగి అనిల్‌కుమార్, కమిషనర్ ఉదయ్‌కుమార్ పేర్కొన్నారు.

రామగుండం మేయర్ బంగి అనిల్‌కుమార్
కోల్‌సిటీ, డిసెంబరు 5: కాలుష్య నివారణతోనే నేలలు పరిరక్షించబడుతాయని రామగుండం నగర మేయర్ బంగి అనిల్‌కుమార్, కమిషనర్ ఉదయ్‌కుమార్ పేర్కొన్నారు. ప్ర పంచ నేలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరపాలక సంస్థ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. మానవులు చేస్తున్న వి నాశక చర్యల వల్ల నేలలు ధ్వంసమవుతున్నాయన్నారు. నే లలను సజీవంగా ఉంచుదాం... జీవవైవిధ్యాన్ని కాపాడుతామనే నినాదంతో 2020జీవ వైవిధ్య దినోత్సవం జరుపుకుంటున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణ లో కంపోస్టు పిట్‌ను ప్రారంభించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రామగుండం నగరానికి ఉత్తమ ర్యాంకు వచ్చేలా అవగాహ న కల్పించాలన్నారు. కార్పొరేషన్ సిబ్బంది కిశోర్‌కుమార్, శంకర్‌రావు, మెప్మా డీఎంసీ రజనీ, సీఓలు పాల్గొన్నారు.