-
-
Home » Telangana » Karimnagar » smartwash rooms in municipaITIES
-
మున్సిపాలిటీల్లో స్మార్ట్‌వాష్ రూమ్స్
ABN , First Publish Date - 2020-03-23T09:58:56+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం నగరపాలక సంస్థలు, మున్సిపా లిటీల్లో ప్రభుత్వ స్థలాల్లో స్మార్ట్ టాయిలెట్స్ నిర్మించాలని నిర్ణయించింది. కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు జిల్లాలోని...

- - కరీంనగర్‌లో ఎనిమిది
- - హుజురాబాద్‌లో ఐదు, జమ్మికుంటలో నాలుగు
- - కొత్తపల్లి, చొప్పదండిలో రెండేసి
- - మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లు
- - ఫుట్‌పాత్‌లు, బస్‌బేలపై ఏర్పాటు
- - ఇంటర్‌నెట్, మొబైల్ ఛార్జీంగ్ సదుపాయాలు
కరీంనగర్ టౌన్, మార్చి 22: రాష్ట్ర ప్రభుత్వం నగరపాలక సంస్థలు, మున్సిపా లిటీల్లో ప్రభుత్వ స్థలాల్లో స్మార్ట్ టాయిలెట్స్ నిర్మించాలని నిర్ణయించింది. కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు జిల్లాలోని హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల్లో స్మార్ట్‌వాష్ రూమ్స్ నిర్మాణాలకు ప్రణాళిక సిద్ధం చేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఎక్కడెక్కడ నిర్మించాలో అధికారులు గుర్తించారు. కరీంనగర్‌లో ఎని మిది, కొత్తపల్లి, చొప్పదండిలో రెండేసి చొప్పున, హుజురాబాద్‌లో ఐదు, జమ్మికుం టలో నాలుగు నిర్మించాలని నిర్ణయించారు. వాణిజ్య, వ్యాపారకేంద్రాల్లో మహిళలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణించి మహిళల కోసం షీటాయిలెట్స్ నిర్మాణాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. అలాగే ప్రభుత్వ స్థలాలు,ఫుట్‌పాత్‌లు, బస్‌బేలపై ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్మార్ట్ వాష్ రూంలలో షీటాయిలెట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వ నున్నారు. టాయిలెట్స్, యూరినల్స్, హ్యాండ్ వాష్ సౌకర్యాలతోపాటు,వైఫై,ఫోన్ ఛార్జింగ్, ఇతర సదుపాయాలు కల్పించి పూర్తిగా శుభ్రత పాటించే విధంగా అధునాతనంగా తీర్చిదిద్దనున్నారు.
ప్రస్తుతం ఉన్న టాయిలెట్లను పూర్తి స్థాయిలో స్మార్ట్ వాష్ రూమ్స్‌గా తీర్చిదిద్దు తారు. కొత్తగా నిర్మించ బోయే టాయిలెట్స్‌ల్లో యూరినల్స్, హ్యాండ్ వాష్ సదుపాయాలతోపాటు ఇంటర్‌నెట్ వైఫై, ఫోన్‌చార్జింగ్ వంటి సదు పాయాలు కల్పిస్తూ పరిశుభ్రతతో నిర్మించాలని సూచించింది. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ స్థలాల్లో, ప్రభుత్వ స్థలాలు లేని ప్రాంతాల్లో ఫుట్‌ఫాత్‌లు, బస్‌బేలపై నిర్మించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం టాయిలెట్స్‌కు సంబంధించిన మూడు డిజైన్‌లను ఇప్పటికే నగరపాలక సంస్థ అధికారులకు పంపించారు. ఆయా ప్రాంతాల్లో అవసరాలకు అనుగుణంగా ఈ డిజైన్‌లను వినియోగించుకోవాలని నగర పాలక సంస్థల అధికారులకు సూచించింది. దీనితో జిల్లాలో నిర్మించనున్న స్మార్ట్‌వాష్‌రూమ్స్, షీటాయిలెట్ల డీపీఆర్‌ను, డిజైన్‌ను రూపొందించి మున్సిపల్ ఉన్నతాధికారులకు పంపించారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే వాటి నిర్మాణాలు చేపడతామని అధికారులు తెలిపారు.
స్మార్ట్ వాష్ రూం ప్రత్యేకతలు..
స్మార్ట్‌వాష్ రూమ్స్‌లో వివిధ సదుపా యాలు కల్పించనున్నారు. పీపీపీ(ప్రభుత్వ, ప్రైవేటు, పార్ట్‌నర్‌షిప్)తో నిర్మిస్తున్న ఈ భవనాల్లో ప్రచార బోర్డులు ఏర్పాటు చేసు కునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఫోన్ ఛార్జింగ్, వైఫై సదుపాయం కల్పించడంతో పాటు ఏటీఎం, కెఫే, జిరాక్స్ సెంటర్ పెట్టు కోవడానికి వీలు కల్పించారు.
వీటి వల్ల ఆదాయం వచ్చే అవకాశం ఉండే అవకాశా లున్నాయి. ప్రస్తుతం ఉన్న పబ్లిక్ టాయిలె ట్స్‌ను కూడా పూర్తి స్థాయిలో స్మార్ట్‌వాష్ రూమ్స్‌గా మార్చాలని కూడా ప్రభుత్వం సూచనలిచ్చింది. బస్ స్టాప్‌ల వద్ద బస్‌బే మొదటి అంత స్తుపై వాష్ రూమ్స్ నిర్మించే అవకాశం ఉండ డంతో వ్యాపారులు కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.