స్మార్ట్ రోడ్లను త్వరితగతిన పూర్తిచేయాలి
ABN , First Publish Date - 2020-11-27T05:16:59+05:30 IST
నగరపాలక సంస్థ ఆధ్వ ర్యంలో చేపడుతున్న స్మార్ట్ సిటీ రోడ్డు పనులను నాణ్యతా ప్రమాణాలను పాటి స్తూ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కె శశాంక అన్నారు.

కలెక్టర్ కె శశాంక
కరీంనగర్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నగరపాలక సంస్థ ఆధ్వ ర్యంలో చేపడుతున్న స్మార్ట్ సిటీ రోడ్డు పనులను నాణ్యతా ప్రమాణాలను పాటి స్తూ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కె శశాంక అన్నారు. గురువారం కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో స్మార్ట్‌సిటీ పనులపై అధికారులతో సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ పనులు ఆ లస్యం అవుతుండడం వలన ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయ న్నారు. వాహనాలు వెళుతున్నపుడు దుమ్మూ, ధూళితో ప్రజలు అసౌకర్యాలకు గురవుతున్నారని అన్నారు. తొందరగా పనులు పూర్తిచేయాలని, ఇంజనీరింగ్ అధికారులు, స్మార్ట్ సిటీ ఏజెన్సీని ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించి క్లియర్ చేయాలని టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. రోడ్లు ఎలాంటి ఆక్రమణలకు గురికాకుండా చూడాలని అన్నారు. రోడ్ల నిర్మాణ సమయంలో ఆక్రమణలు తొలగించిన విషయాలను పూర్తి వివరాలతో ఒక వారం రోజుల్లో నోట్ తయారు చేసి సమర్పించాలని టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఎదుట నిర్మిస్తున్న ఫుట్‌పాత్ రేయిలింగ్ పనులు, మొక్క లు నాటుట, ఇతర గ్రీనరీ, ల్యాండ్ స్కేప్ పనులను క్లియర్‌గా ఉన్న వాటిని డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ ఏజెన్సీ కాంట్రాక్టర్లను ఆదేశించారు. మిగిలిన రోడ్ల పనులను కూడా డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని కాం ట్రాక్టర్లను ఆదేశించారు. ఆక్రమణలు, సమస్యలు లేనివి, క్లియర్‌గా ఉన్న రోడ్డు పనులను ముందుగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వల్లూరు క్రాంతి, ఎస్‌ఈ కృష్ణారావు, స్మార్ట్ సిటీ ఏజెన్సీ లీడ్ జగదీష్, డీసీపీ సుభాష్, మున్సిపల్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.